Movies

నాగార్జునతో మెహ్రీన్

నాగార్జునతో మెహ్రీన్

కథానాయకుడు నాగార్జున.. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో నాగ్‌కు జోడీగా తొలుత కాజల్‌ను ఎంపిక చేశారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొంది. దీంతో ఆమె స్థానంలో అమలాపాల్‌ ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ ఛాన్స్‌ యువ కథానాయిక మెహ్రీన్‌ వరించినట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో కథా చర్చలు పూర్తి చేసిందని, స్క్రిప్ట్‌ నచ్చడంతో నాగ్‌ సరసన నటించేందుకు అంగీకరించినట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున మాజీ రా అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.