NRI-NRT

20 అనాధ బాలికలకు ₹4లక్షల ఉపకారవేతనాలు అందజేసిన “తానా-చేయూత”

TANA Foundation Cheyutha Scholarships To 20 Orphan Girls At CSS

తెలంగాణ రాష్ట్రంలోని మునగనూర్‌లో గల సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ (CSS) అనాధ బాలికల ఆశ్రమానికి చెందిన 20మందికి తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమం కింద ₹4లక్షల ఉపకారవేతనాలు అందజేసినట్లు ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్ తెలిపారు. అనాధ బాలికలను ఆదుకుని వారి బంగారు భవితకు బాటలు వేస్తున్న CSS నిర్వాహకులను తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ కొనియాడారు. STEM కోర్సుల వైపు విద్యార్థినులు దృష్టి సారించి జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. CSS వ్యవస్థాపకురాలు విజయలక్ష్మీ తానాకు ధన్యవాదాలు తెలిపారు. తానా-చేయూత పథకం కింద ఇప్పటి వరకు 300మంది విద్యార్థులకు ₹6లక్షల విలువైన పాఠ్య/లేఖన సామాగ్రిని, 2020లో ₹10లక్షల విలువైన 30ఉపకారవేతనాలు, నిత్యావసరాలు, సరుకులను అందజేసినట్లు శశికాంత్ తెలిపారు. 2020-21 మధ్య CSSకు ₹20లక్షల విరాళాలు అందజేసిన దాతలు డా.జంపాల చౌదరి, డా.కాకరాల ప్రసాద్, వెంకట్ యార్లగడ్డ, వల్లేపల్లి ప్రియాంక, గొర్రెపాటి శ్రీనివాస్‌చంద్, పంచమర్తి నాగ, నూతక్కి సుధ, గోగినేని శ్రీనివాస్, వేజెండ్ల JPలకు తానా ఫౌండేషన్ తరఫున శశికాంత్ ధన్యవాదాలు తెలిపారు.