DailyDose

అన్న‌గారికి చుట్ట‌తాగ‌టం అల‌వాటు చేసింది ఎవ‌రో తెలుసా!

అన్న‌గారికి చుట్ట‌తాగ‌టం అల‌వాటు చేసింది ఎవ‌రో తెలుసా!

స్నేహితుల వల్ల కొన్ని అలవాట్లు అబ్బడం సహజం. ప్రతిరోజు స్నేహితులను కలవడం.. వాళ్ళతో మాట్లాడటం వల్ల వారి అలవాట్లు మనకు కూడా అలవాట్లు గా మారిపోతాయి. అందువల్లే సిగరెట్, మద్యం తాగే అలవాటు ఉన్న స్నేహితులతో తిరగడం వల్ల చెడిపోతారని తల్లిదండ్రులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇక సినిమా పరిశ్రమలో చాలామంది హీరోలకు సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న హీరోలే కాకుండా ఒకప్ప‌టి హీరోలకు సైతం పొగ తాగే అలవాటు ఉండేదట. అయితే ఇప్పుడు అంటే సిగరెట్లు ఉన్నాయి కానీ అప్పట్లో ధూమపానం అంటే చుట్ట తాగే అలవాటు ఉండేది. ఇక ఆ అలవాటు అన్నగారు ఎన్టీ రామారావు కు కూడా ఉండేదట. అంతేకాకుండా ఈ అలవాటు ఎన్టీ రామారావు తన స్నేహితుడి దగ్గర నేర్చుకున్నార‌ట‌. ఆ స్నేహితుడు కూడా ఎవరో కాదు. ప్రముఖ నటుడు ముక్కామల కృష్ణమూర్తి. ఈయన టాలీవుడ్ లో 300ల‌కు పైగా సినిమాల్లో నటించారు.అప్పట్లో విల‌న్ పాత్రలకు ముక్కాముల‌ కృష్ణమూర్తి పెట్టింది పేరు. కండ్ల‌తో భ‌య‌పెట్టడంలో కృష్ణమూర్తి పీజీ చేశారనే చెప్పాలి. అందువల్ల ఆయ‌న విల‌నిజంకు ప్రత్యేక అభిమానులు కూడా ఉండేవారు. కేవలం నటనతోనే కాకుండా దర్శకుడిగా కూడా ముక్కామల కృష్ణమూర్తి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఎన్టీ రామారావు ముక్కాముల‌ కృష్ణమూర్తి మధ్య కాలేజీ రోజుల నాటి నుండి స్నేహం ఉండేదట. అంతేకాకుండా ఎన్టీఆర్ ముక్కామల కృష్ణమూర్తి మరియు జంద్యాల‌ కలిసి కాలేజీ రోజుల నుండే నాటకాలు వేసేవారట. అయితే ఆ సమయంలో ముక్కాముల‌ కృష్ణమూర్తికి చుట్ట తాగే అలవాటు ఉండటంతో అది కాస్త ఎన్టీఆర్ కూడా నేర్చుకున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తనయుడు నట సింహం నందమూరి బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాకుండా ఎన్టీరామారావు కు ఉన్న విధంగానే తనకు సైతం చుట్ట‌తాగే అలవాటు ఉండేద‌ని బాలకృష్ణ వెల్లడించారు.