NRI-NRT

కెనడాలో వైభవంగా తాకా 2022 సంక్రాంతి సంబరాలు

కెనడాలో వైభవంగా తాకా 2022 సంక్రాంతి సంబరాలు

తాకా (తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) జనవరి 15వ తేదీ,2022 శనివారం నాడు సంక్రాంతి సంబరాలను ఘనంగా కెనడాలోని టొరంటో నగరంలోని శృంగేరి కమ్యూనిటీ సెంటరులో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వందలాది మంది అంతర్జాలంలో వీక్షించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్, విద్య భావనం, మరియు రేణు కుందెమ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

తాకా అధ్యక్షురాలు కల్పనా మోటూరి, అనిత సజ్జ, సీత శ్రావణి పొన్నలపల్లి కార్యక్రమాన్నిజ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కల్పనా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి కోవిద్-19 కష్ట కాలంలో తాకా చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలు గురించి వివరించారు. తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను అందరినీ ఆహ్వానించి సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. 20 కి పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డాన్సులుతో ఉల్లాసంగా కార్యక్రమం జరిగింది.

ఈ సంవత్సరం టొరంటో తెలుగు తిధులు, నక్షత్రాలకు అనుగుణంగా ప్రచురించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించారు. 2019-2021 మాజీ కార్యవర్గ సభ్యులను మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరల,రాణి మద్దెల మరియు ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరిని అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు.