Food

కటకటాల్లో భొజనం .. కాకినాడలో ‘ఖైదీ’ రెస్టారెంట్.

కటకటాల్లో భొజనం  ..  కాకినాడలో ‘ఖైదీ’ రెస్టారెంట్.

ఏదైనా చేయకూడని పని చేస్తే ‘ చిప్పకూడు తినాలని ఉందా ‘ అంటారు. అంటే, జైల్లో పెట్టే భోజనమని అర్థం .. కానీ … అసలు జైలు అంటే ఎలా ఉంటుంది. ఆ వాతావరణంలో కాసేపు గడిపి , అక్కడే భోజనం చేస్తే బాగుంటుందని అనుకునే వాళ్లు లేకపోలేరు . అలాంటి వాళ్ల సరదా తీర్చడానికే తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ‘ఖైదీ’ అనే పేరుతో ఓ రెస్టారెంట్ ఏర్పాటుచేశారు . అక్కడికి వెళ్లిన వినియోగదారులకు ఖైదీ దుస్తుల్లో ఉన్న సిబ్బంది సేవలందిస్తారు. ఖైదీల్లాగే సెల్లో కూర్చొని తమకు ఇష్టమైన రుచులను ఆరగించొచ్చు. హోటల్లో కొవిడ్ నిబంధనల మేరకు 14 బ్యారక్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సెల్లో ఆరుగురు కుటుంబసభ్యులు కూర్చునేలా .. పెద్ద కుటుంబమైతే 20 మంది కూర్చొనేల ప్రత్యేక బ్యారక్ ఏర్పాటుచేశారు. బిల్లు వకీలాబాక్కు చెల్లిస్తే బెయిలు మంజూరై వినియోగదారులు బయటకు వెళ్లొచ్చు.