DailyDoseHealth

ఒమిక్రాన్ లక్షణాలుంటే .. ఈ జాగ్రత్తలు పాటించండి

ఒమిక్రాన్ లక్షణాలుంటే  .. ఈ జాగ్రత్తలు పాటించండి

ఒమిక్రాన్ తీవ్రత తక్కువ. కానీ శరవేగంతో వ్యాపిస్తుంది. దీన్ని తిప్పతీగ కషాయం తో అరికట్టవచ్చు. పచ్చి ఆకులు తింటే కొందరికి గ్యాస్ వస్తుంది. కానీ వేన్నీళ్ళలో ఆకులు వేసి ఆ కషాయం తాగితే ఒక్క రోజు లో జ్వరం …ఇతర లక్షణాలు తగ్గుతున్నాయి.

తిప్పతీగ జ్వర నివారిణి. ఇమ్యునిటీ ని బాగా పెంచుతుంది. ముఖ్యంగా కోవిడ్ అనగానే అందరూ మానసికంగా కుంగిపోతారు. తిప్పతీగ ఆ మానసిక ఒత్తిడి ని తగ్గించి… ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కోవిడ్ మెదడు పై కూడా దుష్ప్రభావం చూపుతుంది. తిప్పతీగ వాటిని తొలగించగలదు. మంచి నిద్ర కూడా పడుతుంది. ఆకలిని పెంచుతుంది.

డోలో 650 వేస్తే జ్వరం తాత్కాలికంగా తగ్గుతుంది. కానీ నాలుగు గంటల్లో తిరిగి వస్తుంది. ముఖ్యంగా చలిజ్వరం వస్తుంది ఒమిక్రాన్ లో.
అందుకే డోలో వేసుకున్నా కానీ తిప్పతీగ కషాయం తాగడం మర్చిపోవద్దు. రెండు పూటలా కషాయం తాగి…నువ్వు లు తిని…వేన్నీళ్ళు తాగి…జింక్ సప్లిమెంట్స్… బీ కాంప్లెక్స్… సి విటమిన్ సప్లిమెంట్స్ వేసుకుని నిద్ర పోతే తెల్లారే లోపు అన్ని సింప్టమ్స్ దాదాపు గా తగ్గిపోతాయి. దగ్గు ఎక్కువగా ఉంటే మిరియాలు బాగా నమిలి మింగాలి. అల్లం ముక్కలు నములుతుండాలి. ఎండలో కూడా నడవాలి.
సంక్రాంతి పేరుతో జనాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకే కోవిడ్ జడలు విప్పుకుంది.
మన మూర్ఖత్వమే మన కష్టాలకు కారణం. పండక్కి ముందే వేవ్ మొదలైనా…మన తిరగడం తగ్గించలేదు.చేతులు కాలాయి. ఇప్పటికైనా ఆకులు పట్టుకుందాం. తిప్పతీగ ఆకులు పట్టుకుందాం. కోవిడ్ లేని వాళ్ళు కూడా ఒక వారం ఉదయం సాయంత్రం తిప్పతీగ కషాయం తాగితే ఇన్ఫెక్షన్ రాదు. అంత ఇమ్యునిటీ పెరుగుతుంది.
తిప్పతీగ మన స్వంత వైద్యం కాదు. ఆయుర్వేదం లో చాలా మంచి మందు.ఆయుష్ ప్రకటించింది… తిప్పతీగ ఇమ్యునిటీ ని పెంచి జ్వరాన్ని తగ్గిస్తుందని.
కోవిడ్ ఊపిరితిత్తుల్లోని గ్లైసీన్ ని తినేస్తుంది.అందువల్ల వాసన…రుచి కోల్పోతాం. నువ్వు ల్లో గ్లైసీన్ ఉంటుంది. అందుకే నువ్వు లు బాగా తింటే లంగ్స్ డేమేజ్ నుండి కాపాడుకోవచ్చు. స్మెల్ పోదు.

పాలు…పెరుగు వైరస్ ని మరింత పెంచుతాయి. అందుకే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి. పల్చటి మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది.
జ్వరం ఉన్నప్పుడు నాన్వెజ్ అసలు తినకూడదు. లంఖణం పరమౌషదం అంటారు. జ్వరం ఉన్నప్పుడు వీలైనంత తక్కువ తింటే…ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది. జ్వరం తగ్గాక బాగా ఆకలేసినప్పుడు ఫుల్ గా తిన్నా ఏం కాదు. కానీ ఆకలి లేకపోయినా బాగా తింటే కోవిడ్ తగ్గుతుందనే అపోహతో ఏది పడితే అది ఎక్కువగా తిని పొట్ట మీద భారం మోపితే…శరీరం తనకున్న కొద్ది శక్తి ని జీర్ణక్రియ కే ఉపయోగిస్తుంది. అందువల్ల వైరస్ మీద పోరాడటానికి దానికి శక్తి చాలదు.

మనం ఏ మందులు వాడినా వాడకపోయినా…స్వతహాగా శరీరం తనని తాను స్వస్థ పరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. సరైన విశ్రాంతి ని ఇస్తే అది తన పని తాను చేసుకుంటుంది. విశ్రాంతి అంటే జీర్ణాశయాన్ని వీలైనంత ఖాళీ గా ఉంచడమే…జ్వరం తగ్గేంతవరకూ.అలాగే వీలైనంత వరకూ ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.తప్పనిసరి గా ఎండలో నడవాలి.టీవీ లో వార్తలు చూడ్డం ఆపేయాలి. వామ్మో అంతమంది కి వచ్చింది ఇంతమందికి వచ్చింది మన పరిస్థితి ఏంటని గుండెలు బాదుకోవద్దు. ఇప్పుడు కోవిడ్ తేలిగ్గా నే తగ్గుతుంది.

ఒమిక్రాన్ కి డెల్టాకు తేడా ఏంటంటే ఒమిక్రాన్ కేవలం లంగ్స్ మీదనే పనిచేస్తుంది. డెల్టా వల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ ఔతున్నాయి. ఒమిక్రాన్ డెల్టా అంత సీరియస్ కాదు. కానీ ఇంకా అక్కడక్కడ డెల్టా వేరియంట్ కూడా ఉంది. కాబట్టి ఒమిక్రానే గదా ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఓవరాక్షన్ చేయకుండా ఉండాలి మనం.
కోవిడ్ ఎవరి శరీరం మీద ఏ ఎఫెక్ట్ చూపిస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అందరం వళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి.మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా…మానసిక ఒత్తిడి లు…ఇంట్లో వాళ్ళతో గొడవలు లేకుండా చూసుకోవాలి. టెన్షన్ లు కూడా ఇమ్యునిటీ ని తగ్గిస్తాయి.సిగరెట్లు… ఆల్కహాల్ లు తగ్గించి రోజు ఎండలో వాకింగ్ చేస్తేనే ఇమ్యునిటీ బావుంటుంది.
సర్వేజనా సుఖినోభవంతు