NRI-NRT

TPAD ఆధ్వర్యంలో విజయవంతంగా రక్తదాన శిబిరం

TPAD ఆధ్వర్యంలో విజయవంతంగా రక్తదాన శిబిరం

డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యములో గత 6 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న రక్తదాన శిబిరం గడచిన శనివారము మార్చ్ ఐ .టి .స్పిన్ ఆఫీస్ ప్రాంగణము,ప్లేనో డాలస్ నగరములో జరిగినది. ఈ శిబిరంలో ‘కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ’ సహాయంతో 50 మంది రక్త దాతల నుండి, 32 యూనిట్లు అనగా 8000ml రక్తం సేకరించబడినది . ప్రతి యూనిట్ రక్తం ముగ్గురు వ్యక్తులను ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు అనగా ఈ శిబిరంలో సేకరించిన రక్తము సుమారు 96 మంది ప్రాణము కాపాడగలము. ‘కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ’ లెక్క ప్రకారం ఈ శిబిరంలో సేకరించిన రక్తము వలన 7 గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు , 12 సార్లు రక్త మార్పిడి జరుగగలవు. ఈ రక్తదాన శిబిరము నిర్వహణ చంద్రారెడ్డి పోలీస్ టీపాడ్ ప్రెసిడెంట్ మధుమతి వ్యాసరాజు రక్తదాన శిబిరం సమన్వయ కర్త, టీపాడ్ ఫౌండేషన్ కమిటీ జానకి రామ్ మందాడి, రాజ వర్ధన్ గొంది, అజయ్ రెడ్డి, రావు కలవల, మహేందర్ కామిరెడ్డి, రఘు వీర్ బండారు, ఉపేందర్ తెలుగు, రామ్ అన్నాడి, అశోక్ కొండల, బోర్డు అఫ్ ట్రస్టీస్ పవన్ గంగాధర, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, ఇంద్రాణి పంచార్పుల, బుచ్చి రెడ్డి గోలి, శారద సింగిరెడ్డి, ఆఫీస్ బేరర్స్ కమిటీ రవికాంత్ రెడ్డి మామిడి వైస్ ప్రెసిడెంట్, మాధవి లోకిరెడ్డి జనరల్ సెక్రటరీ, లక్ష్మి పోరెడ్డి జాయింట్ సెక్రటరీ, అనురాధ మేకల ట్రెసరర్, శంకర్ పరిమళ్ జాయింట్ ట్రెసరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ శ్రీనివాస్ వేముల, రత్నఉప్పాల, రూపకన్నయ్య గిరి, దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, రోజా అడెపు, లింగారెడ్డి, అడ్వైజరి కమిటీ సభ్యులు వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, నరేష్ సుంకిరెడ్డి , కరణ్ పోరెడ్డి , జయ తెలకలపల్లి, సురేందర్ చింతల,అరవింద్ ముప్పిడి, గంగ దేవర, సతీష్ నాగిళ్ల , సంతోష్ కోరె, కళ్యాణి తాడిమెట్టి , కొలాబరేషన్ కమిటీ, వంశీ కృష్ణ , స్వప్న తుమ్మపాల, శ్రీనివాస్ తుల, విజయ్ రెడ్డి, అపర్ణ కొల్లూరి,అనూష వనం, శశి రెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి , మాధవి ఓంకార్, గాయత్రి గిరి , జయశ్రీ మురుకుట్ల, రవీంద్ర ధూళిపాళ, శ్రీనివాస్ కూటికంటి,శరత్ పున్ రెడ్డి,శ్రీధర్ కంచర్ల, శ్రీనివాస్ అన్నమనేని, స్రవణ్ నిడిగంటి, నితిన్ చంద్ర, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర,నితిన్ కొర్వి , సుగాత్రి గుడూరు, మాధవి మెంట ,వందన గోరు,ధనలక్ష్మి రావుల, లావణ్య యరకాల, శ్రీకాంత్ రౌతు, తిలక్ వన్నంపుల ఆధ్వర్యములో జరుపబడినది. టీపాడ్ కార్యవర్గ బృందం మరియు కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ టెక్నిషియన్స్ శిబిరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరినీ చక్కగా ఆదరించి ఆహ్వానించారు. ఇంత చక్కటి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీపాడ్ సంస్థకి రక్త దాతలు సంతోషముతో కృతజ్ఞతలు తెలిపారు. డాలస్ నగరములో చదివే విద్యార్థులు పెద్ద సంఖ్యలో హజరయ్యి ఈ సేవా కార్యక్రమములో పాల్గొని వారి వంతు సహాయ సహకారాలను అందించారు. టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రా రెడ్డి పోలీస్ సంస్థ చేసే కమ్యూనిటీ సేవ కార్య క్రమాల గురించి మాట్లాడుతూ ఏప్రిల్ 6, 2019 న జరుగుబోయే ‘ఫుడ్ డ్రైవ్’ విషయాలను వొచ్చిన వారందరికి వివరించారు. తదనంతరం పత్రిక మరియు ప్రసార మాధ్యమాలకు, రక్తం ఇవ్వడానికి వచ్చిన రక్త దాతలకు మరియు రక్త దాన శిబిరం నిర్వహించటానికి కావాల్సిన ప్రాంగణ వసతులు కల్పించిన ఐ.టి.స్పిన్ ఆఫీస్ యాజమాన్యం ఉమ గడ్డం గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.