NRI-NRT

కెనడాలో “తాకా” ఉగాది వేడుకలు

TACA Canada Ugadi 2019

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో ఏప్రిల్ 6 వ తేదిన శనివారం టొరంటో నగరంలోని మైఖేల్ పవర్/ సెయింట్ జోసఫ్ సెకండరీ స్కూల్ లో ఉగాది వేడుకలు దాదాపు 700 మందికి పైగా హజరైన తోటి తెలుగు వారి తో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుక సాంస్కృతిక కమిటీ వాణి, రజని లయం మరియు అరుణకుమార్ లయం ఆద్వర్యం లో అచ్చ తెనుగు సాంప్రదాయ పద్ధతులతో దాదాపు 5 గంటలు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులను అలరించాయి. పండిట్ మంజునాధ్ సిద్ధాంతి వికారి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయగా, లక్ష్మి దుగ్గిన గారు ఉగాది పచ్చడి అందరికి అందచేశారు. ఈ కార్యక్రమానికి రజని లయం మరియు అరుణకుమార్ లయం వ్యాఖ్యాతలు గా వ్యవహిరించారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వానించగా, లక్ష్మి దుగ్గిన, చెంచులక్ష్మి గుత్తా, లక్ష్మి రావిపాటి మరియు ఉమా సాలాది జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది వేడుకలలో దాదాపు వంద మంది టొరంటోలో నివసిస్తున్న చిన్నారులు, యువత మరియు పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలో కూచిపూడి, భరత నాట్యం, కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యాలు, మరియు నాటికలు చిన్న పిల్లల నుండి పెద్దల వరుకు పాల్గొని ప్రేక్షకులను వారి ప్రతిభ సామర్ధ్యాలతో ఉర్రుతలూగించారు. తాకా అద్యక్షులు అరుణకుమార్ లయం గారు తాకా వ్యవస్తాపకతను, ఆవశ్యకతను మరియు భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. తాకా ఉగాది వేడుకల సందర్బంగా తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షుడు రమేష్ మునుకుంట్లని తాకా కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాకా అద్యక్షులు అరుణ్ కుమార్ లయం, ఫౌండేషన్ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ లోకేష్ చిల్లకూరు, వ్యవస్థాపక సభ్యుడు నాథ్ కుందూరు, పూర్వ అద్యక్షులు చారి సామంతపూడి, ఉపాద్యక్షులు రామచంద్ర రావు దుగ్గిన, కార్యదర్శి నాగేంద్ర హంసాల, కోశాధికారి కల్పన మోటూరి,ట్రస్టీ సభ్యులు బాషా షేక్, రాంబాబు కల్లూరి, కిరణ్ కాకర్లపూడి, డైరెక్టర్స్ రాఘవ అల్లం, వాణి పాల్గొన్నారు. తాకా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందచేశారు. తాకా కార్యవర్గం ఈకార్యక్రమదాతలను సభకు పరిచయం చేసింది. తాకా వారు ప్రత్యేకంగా తయారు చేపించిన పిండివంటలతో ఉగాది విందుని ఏర్పాటు చేసారు. ఈ వేడుకను ఎంతో అద్భుతం గా చేపట్టి మరియు విజయవంతము చేసిన తాకా ఫుడ్ కమిటీ ఇంచార్జి కల్పనా మోటూరి, రాఘవ అల్లం, కల్చరల్ ఇంచార్జి వాణిని తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమం లో తాకా వ్యవస్థాపక సభ్యులు నాథ్ కుందూరి, చారి సామంతపూడి లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చివరిగా అందరికి ధన్యవాదాలు చెపుతూ జనగణమన జాతీయగీతంతో కార్యక్రమాన్ని ముగించారు.