WorldWonders

పత్రికా స్వేచ్ఛలో 140వ స్థానంలో భారత్

india ranks 140th place in press freedom index

పత్రికా స్వేచ్ఛలో కాస్త మెరుగు పడ్డామని గత ఏడాది లభించిన సంతోషం ఏడాది తిరిగేలోపే ఎగిరిపోయింది. ఈ ఏడాది నాలుగు స్థానాలు దిగువకు భారత్‌ పడిపోయింది. ప్రపంచంలోని 180 దేశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేసిన రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఇండెక్స్‌లో భారత్ 140వ స్థానంలో నిలిచింది. 2017వ సంవత్సరంలో 136వ స్థానంలో భారత్‌ ఉంది. 2018లో దేశవ్యాప్తంగా ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వీరిలో గౌరీలంకేష్‌ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. హత్య చేసిన వారంతా కేంద్రంలోని అధికార బీజేపీ మద్దతుదారులేనన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల అరాచకాలు, రాజకీయ నాయకుల వేధింపులు, మావోయిస్టుల దారుణాలు జర్నలిస్టులను ఒత్తిడికి గురి చేస్తున్నాయని, దీంతో స్వేచ్ఛగా వార్తలు రాయలేకపోతున్నారని నివేదిక పేర్కొంది.