Agriculture

నిజామాబాద్ రైతుల నామినేషన్లను నిరాకరించిన వారణాసి అధికారులు

nizamabad farmers nominations declined in varanasi

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గంలో బరిలో దిగడానికి 35 మంది తెలంగాణ రైతులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వారి నామినేషన్లను ప్రతిపాదించే వ్యక్తులు లేకపోవడంతో అధికారులు వాటిని స్వీకరించలేదు. వాటిని తిరస్కరించడంతో రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 53 మంది నిజామాబాద్‌ రైతులు వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించారు. అయితే పూల సుబ్బయ్య వెలిగొండ సాధన సమితి అధ్యక్షులు వడ్డె శ్రీనివాస్‌ మాత్రం వారణాసిలో నామినేషన్‌ వేయగలిగారు. వెలిగొండలోని ఫ్లొరైడ్‌, ప్రాజెక్టు సమస్యలను జాతీయ స్థాయికి తీసుకొనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కొల్లూరి కిరణ్‌ శర్మ కూడా నామినేషన్‌ వేశారు.

 

varanasi officers decline nizamabad farmers nominations varanasi officers decline nizamabad farmers nominations varanasi officers decline nizamabad farmers nominations