Business

ఖర్చుల నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తొలగించనున్న కాగ్నిజెంట్

cognizant to fire employees

ఐటీ రంగ దిగ్గజం కాగ్నిజెంట్‌లో ఉద్యోగులను తగ్గించే అవకాశాలున్నాయి. ఇటీవల కంపెనీ దారుణమైన వార్షిక వృద్ధి అంచనాలను వెల్లడించింది. మరోపక్క కంపెనీ నుంచి డిజిటల్‌ బిజినెస్‌హెడ్‌ గజెన్‌ కందియా బయటకు వెళ్లిపోయారు. దీంతో కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిపెట్టింది. ‘‘కంపెనీని పునర్‌ నిర్మించే క్రమంలో యాజమాన్య బృందం పలు వ్యూహాలను పరిశీలిస్తోంది. అదనంగా మరికొంత ఉద్యోగులను విభజించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు, ఎలా అనే దానిపై యాజమాన్యం తుది నిర్ణయం తీసుకొంటుంది.’’ అని కాగ్నిజెంట్‌ తెలిపింది. గత రెండేళ్లలో కాగ్నిజెంట్‌ ప్రధాన కార్యాలయంలో దాదాపు 200 మంది సీనియర్‌ ఉద్యోగులను తొలగించారు. దీనిపై కంపెనీ సీఎఫ్‌వో కరెన్‌ మెక్‌లాఫ్లిన్‌ మాట్లాడుతూ ‘‘మా కంపెనీ భవిష్యత్తు అంచనాలు తగినట్లు ఖర్చులను తీసుకొస్తాము. అదే సమయంలో మా పెట్టుబడులు, ప్రతిభను, సృజనాత్మకత ఎంపికలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళాతాము’’ అని అన్నారు.