Health

తమలపాకులతో పొడిదగ్గు పరార్

Dry cough could be eliminated by chewing betel nut leaves-tnilive telugu health news - తమలపాకులతో పొడిదగ్గు పరార్

సాధారణంగా మ‌న‌లో కొంద‌రికి ఏ కాలంలో అయినా స‌రే పొడి ద‌గ్గు వ‌స్తుంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చాలా మంది పొడిదగ్గుతో సతమతం అవుతూ ఉంటారు. మనం తీసుకునే శ్వాస క్రియలకు ఆటంకం ఏర్పడినప్పుడు దగ్గు వస్తుంది. ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన , శీతలపానీయాలను ఎక్కువగా తాగడం వలన వస్తుంది. అయితే ఇలాంటి పొడి దగ్గు త‌గ్గాలంటే.. అందుకు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. దీంతో ద‌గ్గు స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే…

1. పొడి దగ్గు భాదిస్తున్నపుడు అల్లం టీని తీసుకోవడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

2. చిటికెడు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన‌ మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి.

3. అర టీ స్పూన్ శొంటి పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

4. పొడి దగ్గుతో భాదపడుతూ ఉంటే అర టీ స్పూన్ ఇంగువపొడి , ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం , ఒక టేబుల్ టీ స్పూన్ తేనె ల‌ను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గును తగ్గించుకోవచ్చు.

5. కరక్కాయ కూడా పొడి దగ్గును తగ్గించడంలో దోహద పడుతుంది. కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.

6. పాలలో మిరియాల పొడి వేసుకొని తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

7. తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా దగ్గును తగ్గించుకోవచ్చు.

8. తమలపాకుల‌ను నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు.