NRI-NRT

ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ సంబరం

Australia Telangana Forum ATF Celebrates Telangana Formation Day-ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ సంబరం-TNILIVE Telugu News Australia Telugu news latest international

ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో (ఏటీఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను తెలంగాణ కల్చరల్ నైట్ రూపం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

స్థానిక ఎర్మింగ్టన్ కమ్యూనిటీ సెంటర్లో ఏటీఫ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన తెలంగాణా కల్చరల్ నైట్ ఘనంగా జరిగింది. సిడ్నీ మెట్రో ప్రాంతం నుంచి ఎముకలు కొరికే చలిలో కూడా దాదాపుగా 800 వందల మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తెలంగాణ కల్చరల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక మంత్రి – హానరబుల్ జియోఫ్రే లీ టెరిటరీ విద్యాశాఖ మంత్రి ; పారామాటా; ఎంపీ -హానరబుల్ జూలియా ఫిన్, పారామాటా; స్ట్రాత్ఫీల్డ్ ఎంపీ హానరబుల్ జోడి మక్కే; హాజరయ్యారు. .తొలుత తెలంగాణ అమరులకు, జయశంకర్ సార్కు నివాళి అర్పించి తెలంగాణ ఆటా, పాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది. వేడుకలు జరుగుతున్న ప్రాంతమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మారుమోగిపోయింది.

టెరిటరీ విద్యాశాఖ మంత్రి జియోఫ్రే లీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమవుతుందనడానికి తెలంగాణ ఒక మంచి ఉదాహారణ అని అన్నారు.

ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి; యాంకర్ రవి విశిష్ట అతిథులు గ పాల్గొని తమ ఆటా పాటలతో అలరించారు. పిల్లలు, పెద్దలు తమ ఆట పాటలతో అతిథులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో సింగర్ శ్రావణ భార్గవి ఆలపించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ నివసిస్తున్న తెలంగాణ వాదులలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తాజాగా కలిగించే లక్ష్యంతో ఈ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. సింగర్ శ్రావణ భార్గవి పాటలు పాడుతుంటే ఆహూతులు ఆనందం ఉరకలెత్తి నృత్యాలు చేశారు. పెద్దలతో పాటలు పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక చిన్నారుల చేసిన తెలంగాణా జానపద గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి, అతిథులను విశేషంగా అలరించాయి.
Australia Telangana Forum ATF Celebrates Telangana Formation Day-ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ సంబరం-TNILIVE Telugu News Australia Telugu news latest international
ఏటీఫ్ అధ్యక్షుడు ప్రదీప్ తెడ్ల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతోనే మన కర్తవ్యం పూర్తయినట్లు కాదని, బంగారు తెలంగాణ నిర్మాణంలో మనమందరం బాధ్యత వహించాలని కోరారు. ఏటీఫ్ ఆశయాలను సభకు వివరించారు.కుల,మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాల్సిన ఆవశ్యకతను ఉందన్నారు. ఏటీఫ్ తెలంగాణ కల్చరల్‌ నైట్‌ 2019కి ముఖ్య స్పాన్సర్స్‌గా ఉన్న బాబా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, మిర్చి మసాలా, రైల్వే రోడ్ మెడికల్ సెంటర్, దేసీజ్మరియు ఇతర స్పాన్సర్స్‌కు, ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ, ఫేస్‌బుక్ లైవ్‌లో చూసిన వారందరికీ ప్రదీప్ తెడ్ల ధన్యవాదాలు తెలిపారు.

ఏటీఫ్ ప్రధాన కార్యదర్శి కిశోరె రెడ్డి పంతుల మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలూ కృషి చేసిన ఏటీఫ్ కార్యవర్గ సభ్యు లను కొనియాడారు.

ఈ కారిక్రమంలో, మిథున్ లోక, వినయ్ యమా, ప్రదీప్ సేరి, కావ్య రెడ్డి గుమ్మడవాలి, గోవెర్దన్ రెడ్డి , విద్య సేరి, కవిత రెడ్డి, వినోద్ ఏలేటి, ప్రమోద్ ఏలేటి, పాపి రెడ్డి, సునీల్ కల్లూరి, అనిల్ మునగాల, సందీప్ మునగాల, నటరాజ్ వాసం, శశి మానేం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, నర్సింహా రెడ్డి, రామ్ గుమ్మడవాలి, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియా అధ్యక్షులు అశోక్ మరం, సందీప్ మునగాల పాల్గొన్నారు సిడ్నీ బతుకమ్మ & దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF) అధ్యక్షులు వాసు రెడ్డి టూట్కుర్ మరియు అశోక్ మాలిష్ మరియు ఇతర తెలుగు సంగాల అధ్యక్షలు పాల్గొన్నారు.