Health

వయసు పెరిగే కొద్ది విటమిన్‌-డి లోపం అధికమవుతుంది

Vitamin-D deficiency increases with age so please be careful

మనది ఉష్ణమండల దేశం. ఎండ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా విటమిన్‌-డి లోపం అధికమైంది. జీవనవిధానంలో విపరీతమైన మార్పులు రావడం దీనికి ముఖ్య కారణం. ఎండ తగలకుండా ఉండటం, ఎండలో ఉంటే శరీరానికి సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవడం. విటమిన్‌-డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మరో కారణం. విటమిన్‌-డి లోపం వల్ల శక్తి లోపించడం, కండరాల నొప్పి, జుట్టు రాలడం, ఎముకలు గుల్లబారడం (ఆస్టియోపోరోసిస్‌), మానసిక కుంగుబాటు వంటి సమస్యలు వస్తాయి. మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలను కూడా ప్రస్తుతం విటమిన్‌-డి లోపానికి లింక్‌ చేస్తున్నారు.విటమిన్‌-డి అనేది కొవ్వులో కరిగే విటమిన్‌. ఇది కాలేయంలో నిల్వ ఉంటుంది. మొదటగా కాలేయంలో తయారై అక్కడి నుంచి కిడ్నీలో మనకు ఉపయోగపడే విధంగా మారుతుంది. దీనినే ‘కాల్సిట్రియోల్‌’ అంటారు. ఇది యాక్టివ్‌ విటమిన్‌-డి. వయసు పెరిగే కొద్ది విటమిన్‌-డి లోపం అధికమవుతుంది. 18 శాతం శరీరం 45 నిమిషాల పాటు ఎండకు ఎక్స్‌పోజ్‌ అయితే మనకు కావాల్సినంత విటమిన్‌-డి లభించినట్టే. ఈ విటమిన్‌ను సూర్యకాంతిని గ్రహించి శరీరమే తయారుచేసుకోగలదు.వారానికి కనీసం రెండుసార్లు సాల్మన్‌, సార్డనైస్‌, హెర్రింగ్‌ వంటి చేపలు తీసుకుంటే మంచిది. వైట్‌ ఫ్యాటీ ఫిష్‌ తీసుకోవడం మంచిది.గుడ్డు పసుపు సొనలో విటమిన్‌-డి ఉంటుంది. కొందరు ఎగ్‌ వైట్‌ మాత్రమే తీసుకుంటారు. అలాకాకుండా పసుపు సొనను కూడా తీసుకోవడం మంచిది.పుట్టగొడుగుల్లో కూడా విటమిన్‌-డి ఉంటుంది. వీటిని కొంత సమయం ఎండబెట్టడం వల్ల కూడా విటమిన్‌-డి పెరుగుతుంది. పుట్టగొడుగులను ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.నట్స్‌, ఆయిల్‌ సీడ్స్‌లో కూడా విటమిన్‌-డి లభిస్తుంది. వీటిని డైలీ డైట్‌లో తీసుకోవడం మంచిది.విటమిన్‌-డి ఉన్న సెరెల్‌ బ్రేక్‌ఫాస్టులు, పాలు, పెరుగు, ఆయిల్స్‌ మార్కెట్లో ప్రత్యేకంగా లభిస్తున్నాయి. వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.