Health

తమ రోగానికి తామే గూగుల్‌లో వెతికేసుకుని…

People who are suffering from diseases are searching in google on their own

ఆరోగ్య సమస్యల విషయంలో నగరంలో నయా ట్రెండ్ మొదలైంది. జ్వరం, న్యూరోలాంటి పెద్ద సమస్య దాకా ఏ జబ్బైనా సరే నగరవాసులు గూగుల్ నే ఆశ్రయిస్తున్నారు. తమ సమస్యకు మొదటి డాక్టర్ గూగుల్ లేనని భావించే వారి సంఖ్య పెరుగుతోంది. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పి, బీపీ, షుగర్ ఇలా సమస్య ఏదైనా సరే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి సొంత వైద్యం చేసుకోవటం చాలా మందికి అలవాటుగా మారుతోంది. నిత్యం ఇలా గూగుల్ ద్వారానే వైద్యం చేసుకుంటున్న వారి సంఖ్య సిటీలో లక్షల్లో ఉంటుందని, ఈ వైఖరి ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు తెలుసుకోకుండా గూగుల్ లో చూపించే వైద్య పద్ధతులతో మందులు వాడితే మొదటికే మోసం వస్తుందంటున్నారు. తలనొప్పికి కావాల్సిన మందు కోసం సెర్చ్చేస్తే గుట్టల కొద్దీ సమాచారం వస్తుందని, ఇందులో ఏది ప్రామాణికంగా తీసుకోవాలో సాధారణ వ్యక్తులకు అర్థం కాదంటున్నారు. ఇన్ స్టంట్ పరిష్కారాలు దొరకుతుండటంతో చాలామంది దీర్ఘకాలంలో ఏ సమస్యలు ఉంటాయన్నది పట్టించుకోకుండా గూగుల్ లో చూపించిందే వాడేస్తున్నారు.
**ప్రతి ఆరోగ్య సమస్యకు సెర్చ్…
ఇంతకుముందు చిన్న చిన్న హెల్త్ఇష్యూస్ ఉంటే డాక్టర్లను సంప్రదించే వారు. కానీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న సమస్యను గూగుల్లో సెర్చ్ చేసి ఆందోళనకు గురువుతన్నారు. తమ బాడీలో కనిపించే లక్షణాలను బట్టి ఇది ఏ రోగం అన్నది తెగ వెతికేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్ధో, నెఫ్రాలజీ, గైనకాలజీ వంటి సమస్యలకు గూగుల్ నే ఆశ్రయిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా ముందు జర్వం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు, నీరసం వంటి లక్షణాలే ఉంటాయి. ఇవి కనిపిస్తే చాలు తమకు ఏమైందోనన్న ఫోబియాకు గురువుతున్నారు. లేనిపోని భయాలతో కొత్త ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
**పెయిన్ కిల్లర్స్, లైంగిక సామర్థ్యం పెంచేవి…
చాలా వరకు గూగుల్ ద్వారా వైద్యం పొందుతున్న వారిలో లైంగిక సామర్థ్యం పెంచే మందులను వెతుకుతున్న వారు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలకు డాక్టర్ల వద్దకు వెళ్లాలంటే మొహమట పడే వారు గూగుల్ లోనే మందుల కోసం ఆరా తీస్తున్నట్టు సమాచారం. వందల కొద్ది ఉండే మందుల్లో తమకు నచ్చిన మందు సెలక్ట్ చేసుకుంటున్నారని, ఇవి కొందరు మెడికల్ షాపుకు వెళ్లి తీసుకుంటుండగా, ఇంకొందరు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిని వ్యక్తి శారీరక సామర్థ్యం ఆధారంగా ఎంత డోస్ లో తీసుకోవాలన్న పరిజ్ఞానం లేకపోవడంతో హై డోస్ మందులకు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. తక్షణం నొప్పి మాయం కావాలన్న ఉద్దేశంతో స్టెరాయిడ్స్ ఉన్న మందులను వాడేస్తున్నారు. వైద్యులైతే అవసరాన్ని బట్టి డోస్ ఇస్తుంటారు. కానీ గూగుల్ లో పెయిన్ కిల్లర్స్ ఎలా వాడాలన్న పరిజ్ఞానం ఉండదు. విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ వాడటం కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందంటున్నారు డాక్టర్లు. సమాచారం కోసం మాత్రమే గూగుల్ పై ఆధారపడాలని, వైద్యం విషయంలో మంచిది కాదని చెబుతున్నారు.
**వైద్యులకే వైద్యం నేర్పుతున్నారు…
గూగుల్ తో తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. తమ వద్దకు వచ్చే ముందే గూగుల్ ను శోధించి వస్తున్నారని, తామెలా చేయాలన్నది వారే చెబుతున్నారంటున్నారు. వ్యాధి లక్షణాలను బట్టి ఈ టెస్టులు చేస్తే బాగుంటుందని చాలామంది సజెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సొంత వైద్యంేబ నయం కాకపోతేనే హాస్పిటల్ కు వస్తున్నారంటున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు మెడికల్ టెర్మినాలజీ క్వాలిఫైడ్ వైద్యులకు కూడా పూర్తిగా అర్థం కాదని, అలాంటిటి గూగుల్తో పోహాలకు గురికావద్దని సూచిస్తున్నారు.