Politics

తెదేపాకు అంబికా కృష్ణ టాటా

Businessman Ambica Krishna Joins BJP

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, ప్రముఖ వ్యాపార వేత్త అంబికా కృష్ణ భాజపాలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సమక్షంలో సోమవారం పార్టీ కండువా కప్పుకొన్నారు. నలుగురు తెదేపా రాజ్యసభ సభ్యులు భాజపాలో చేరిన కొద్ది రోజులకే పశ్చిమ గోదావరికి చెందిన కీలకనేతల్లో ఒకరైన అంబికా కృష్ణ కూడా పార్టీని వీడడం గమనార్హం.