DailyDose

రాహుల్ స్థానంలో మోతీలాల్ ఓరా-రాజకీయ-07/03

Motilal Vora In Race To Be INC President

*కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేసిన నేపథ్యంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్‌ నేత మోతీలాల్‌ వోరాను కాంగ్రెస్‌ నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 90 ఏళ్ల వయసున్న వోరా.. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1985 నుంచి 1988 ఫిబ్రవరి వరకు… ఆ తర్వాత 1989లోనూ ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన ప్రస్తుతం ఎగువ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. గతంలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవమూ వోరాకు ఉంది. ప్రస్తుతానికి మోతీలాల్‌ వోరాకు పార్టీ సారథ్య బాధ్యతల్ని తాత్కాలికంగా అప్పగించినా.. పూర్తిస్థాయి అధ్యక్షుడిగా మాత్రం సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే లేదా సుశీల్‌ కుమార్‌ షిండేకు అప్పగించే అవకాశం ఉంది. తనను కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించనున్నారనే వార్తలపై మోతీలాల్‌ వోరా స్పందించారు. ఈ విషయంలో తనకెలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు.
* బీజేపీ కి మా నాయకులే దిక్కా..? : మల్లు రవి
బీజేపీ కి ఇతర పార్టీల నాయకుల మీద ఉన్న శ్రద్ధ .. ప్రజా సమస్యలపై లేదని కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి అన్నారు. ఈ రోజు గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున బీజేపీ లోకి వస్తున్నారని బీజేపీ నాయకులు గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ కి నాయకులు లేరా, మా నాయకులు వస్తేనే దిక్కు ఉన్నట్టా.? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ కి దిక్కు లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారని, ఎన్నికలకు ఇంకా నాలుగేండ్ల సమయముండగా ఎలా దించుతారని ప్రశ్నించారు.కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యే లు టీఆర్ఎస్ లో చేరితే తప్పు అని చెప్పిన బీజేపీ…. ఏపీ లో నలుగురు ఎంపీ లను ఎలా చేర్చుకుందని రవి ప్రశ్నించారు. బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటుందని, ఆ పార్టీ చెప్పేది ఒకటి చేసేది మరోకటని ఆయన అన్నారు.
* సచివాలయం ఖర్చుతో పేదలకు ఇల్లు కట్టించండి : రాజాసింగ్
నిజాం రాజ్యం ఎలా ఉండేదో టీఆర్ఎస్ మరచి పోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చార్మినార్ పేరు చెబితే నిజాం పేరు చెప్తారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నాడని..నిజాం పాలన తరహాలో కేసీఆర్ పాలిస్తున్నారు అనడానికి మంత్రి కామెంట్ లు నిదర్శనం అన్నారు. శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చూస్తే అదే నిజమనిపిస్తుందని చెప్పారు రాజాసింగ్. మీ హామీలేమయ్యాయి.. నీళ్లు, నిధులు నియామకాలు ఏమయ్యాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైంది. పట్టించుకున్నరా. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గొప్పలకు పోవడం మంచిది కాదని తెలిపారు. కమీషన్ ఇవ్వండి .. ఫైల్లు తీసుకోండి అన్నట్టు పాలన సాగుతోందన్నారు.
* జగన్ విద్యార్థుల నోటికాడి కూడు తీసేశారు : లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో … 2 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం దూరమైందంటూ ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అవసరమా అని జగన్ చేసిన వ్యాఖ్యలనే ఆదేశాలుగా… అధికారులు విద్యార్థులకు పథకం ఆపేశారంటూ కథనాలు వచ్చాయి. దీనిపై నారాలోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.“జగన్.. తన రాజభవనం ముందు 1.3 కి.మీ. రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు, టాయిలెట్స్ కట్టడానికి రూ.30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి రూ.75 లక్షలు, హెలిప్యాడ్ కు రూ.1.89 కోట్లు… ఇలా విచ్చలవిడిగా జగన్ ఖర్చు పెడుతున్నారు. కానీ పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం. పొదుపు చేసుకోవాలంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసెయ్యాలా?” అని ప్రశ్నించారు లోకేశ్
* కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ ఓరా
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడుగా సీనియర్ నేత మోతీలాల్ ఓరానుఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడిగా తన రాజీనామాను రాహుల్ గాంధీ అధికారికంగా కొద్ది సేపటి క్రితమే ప్రకటించడంతో పార్టీ అధిష్ఠానం తాజా నిర్ణయం తీసుకుంది. మోతీలాల్ ఓరాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మోతీలాల్ ఓరా గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.కాగా, రాహుల్ గాంధీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, తాను ఇప్పటికే అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని, సీడబ్ల్యూసీ వెంటనే సమావేశమై కొత్త అధ్యక్షుడిని నిర్ణయించాలని అన్నారు. దీనికితోడు, తన రాజీనామా నిర్ణయానికి కారణాలపై ఒక లేఖను కూడా విడుదల చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు చెప్పారు. విశ్వసనీయత అనేది పార్టీ ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైందని, అది కొరవడకూడదన్న ఉద్దేశంతోనే తాను రాజీనామా చేశానన్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. పార్టీలోనే పుట్టి, పార్టీలోనే పెరిగిన తాను పార్టీకోసం ఎలాంటి సేవలు అందించేందుకైనా సిద్ధమేనని పేర్కొన్నారు.
* నేను ఎక్కడా ఏ తప్పూచేయలేదు: చంద్రబాబు
ప్రతిపక్షంలో ఉన్నామని బాధపడొద్దని.. ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడాలని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. సొంత నియోజకవర్గం పర్యటనలో భాగంగా రెండో రోజు గుడుపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వరుసగా ఏడుసార్లు తనను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాటంతో ముందుకెళ్లడమే తప్ప వెనుతిరగడం తనకు తెలియదన్నారు. తాను ఎక్కడా ఏతప్పూ చేయలేదని.. ఐదేళ్ల పాటు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కష్టపడ్డానని చెప్పారు.
* బీజేపీపై ద్వేషం లేదు.. కానీ: రాహుల్‌ గాంధీ లేఖ
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఇవాళ రాహుల్‌ గాంధీ లేఖ విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నట్లు తన లేఖలో రాహుల్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దేశ పునర్‌ నిర్మాణంలో పాల్గోవాలన్నారు.
* కాంగ్రెస్కు నేను అధ్యక్షుడ్ని కాదు: రాహుల్
సార్వత్రిక ఎన్నికల ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంపై రాహుల్ గాంధీ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. కొత్త అధ్యక్షుడు ఎవరో పార్టీ సత్వరమే తేల్చాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. తాను ఇప్పటికే రాజీనామా చేశానని, అధ్యక్షుడ్ని కాదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సాధ్యమైనంత త్వరగా సమావేశమై, నిర్ణయం తీసుకోవాలని సూచించారు రాహుల్.
* ఏపీలో త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు: బొత్స
రాష్ట్ర వ్యాప్తంగా పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇవాళ్టితో పాలకవర్గాల గడువు ముగిసిన తొమ్మిది కార్పొరేషన్లు, 90 మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ కమిషనర్ల కార్యశాలకు మంత్రి బొత్స ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పురపాలక ఎన్నికలు జరిగేవరకు ప్రత్యేకాధికారుల పాలన ఉంటుందని స్పష్టం చేశారు. వార్డు సభ్యుల ఎన్నికకు రిజర్వేషన్లు, విలీన గ్రామాల అంశాలు వంటి కొన్ని అవరోధాలున్నాయని.. సీఎం జగన్‌ ఆదేశాలకు మేరకు సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని చెప్పారు. ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు ఉండవునెలరోజుల క్రితం అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం పూర్తి స్నేహపూర్వకమైనదని.. ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్షలు ఉండబోవని బొత్స అన్నారు.ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబంలో సభ్యులేనని.. వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. మున్సిపాలిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కమిషనర్లు ముందుకు సాగాలన్నారు. క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు రాకుండా కాగితాల్లో అంతా బాగుందనే భావన తేవొద్దని మంత్రి హితవు పలికారు. త్వరలోనే కమిషనర్ల బదిలీలు జరుగుతాయని.. వారికి కేటాయించిన ప్రాంతానికి వెళ్లి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
* ఆ నలుగురిని బీజేపీలోకి పంపింది బాబే: జగన్‌కు భయపడే, తలసాని వ్యాఖ్యలు…..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తనపై ఉన్న అవినీతి కేసులకు భయపడే తనకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులను చంద్రబాబు బీజేపీలోకి పంపారని సంచలన ఆరోపణలు చేశారు.నలుగురు ఎంపీలు టీడీపీ అధినేతకు అత్యంత ఆప్తులని…. చంద్రబాబుకు సంబంధించిన అన్ని వ్యక్తిగత , వ్యాపార, రాజకీయ విషయాలపై వారికి స్పష్టమైన అవగాహన వుందన్నారు.నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో అక్కడ అవినీతి రాజ్యమేలిందని.. టీడీపీ నేతలు దేనిని వదలకుండా దోపిడీ చేశారని తలసాని ధ్వజమెత్తారు.ఇప్పుడు అధికారం కోల్పోవడం.. కొత్త ప్రభుత్వం బాబు పాలనపై ఎంక్వైరీ కమిటీ వేయడంతో బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని తన మిత్రులకు కాషాయ కండువా కప్పించారని తలసాని ఆరోపించారు.ఇక తెలంగాణలో కాలం చెల్లిన నేతలకు బీజేపీ కండువా కప్పుతోందని శ్రీనివాస్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 25 ఏళ్ల నుంచి తెలుగునాట ఎదగడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఇంకా తెలియడం లేదా అని ఆయన ప్రశ్నించారు.డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా… బీజేపీ నేతలు ఇంకా గుణపాఠం నేర్వేలదని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ నేతలకు నిరీక్షణ తప్పించి నో యూజ్ అని తలసాని వ్యాఖ్యానించారు.
* బెంగాల్లో RSS జాయినింగ్స్ జోరు
తృణమూల్ చీఫ్, వెస్ట్బెంగాల్ సీఎం మమతా బెనర్జీని మరింత కలవరపెట్టేలా ఆ రాష్ట్రంలో హిందూత్వ ఆర్గనైజేషన్లు వేగంగా విస్తరిస్తున్నాయి. బీజేపీ ఐడియాలజికల్ పాట్రన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరేందుకు బెంగాలీలు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. సంస్థ మెంబర్షిప్ డ్రైవ్లో వెస్ట్బెంగాల్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. జూన్ 15 నాటికే ఆర్ఎస్ఎస్లో చేరతామంటూ అప్లికేషన్లు పెట్టుకున్నవారి సంఖ్య 7,700కు చేరింది. 9,392 అప్లికేషన్లతో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర మూడో స్థానంలో, కర్ణాటక, ఢిల్లీలు నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే (జూన్ 15 నాటికే) అప్లికేషన్ల సంఖ్య 62వేలు దాటింది. 2017లో లక్ష, 2018లో లక్షాపదివేల మంది సంస్థలో మెంబర్స్ అయ్యారు. ఓవరాల్గా ఆర్ఎస్ఎస్లో 60లక్షల మెంబర్స్ఉన్నారు. వెస్ట్బెంగాల్లో 2014 తర్వాతే జాయినింగ్స్ ఊపందుకున్నాయి. 2017లో 7,400గా ఉన్న మెంబర్షిప్స్, 2018లో 9000కు పెరిగింది. 2019 ఫస్ట్ హాఫ్లోనే 7,700 అప్లికేషన్‌‌లు వచ్చాయి. హిందువుల పట్ల దీదీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై వ్యతిరేకత ఉందని, దానికితోడు ఆర్ఎస్ఎస్ చేపట్టే సేవా కార్యక్రమాలకూ యువత అట్రాక్ట్ అవుతున్నారని, కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నవాళ్లలో 70 శాతం మంది 20నుంచి 35ఏండ్లలోపు యువకులేనని, అందులోనూ 60 శాతం మంది శాఖల్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఆర్గనైజన్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడం వల్లే బెంగాల్లో పార్టీ బలపడిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
* ఆకస్మిక తనిఖీలు చేస్తాను : సీఎం జగన్‌
ఏపీ సీఎం వరస సమీక్షలతో బిజీ అయ్యారు. రాష్ట్ర వాప్తంగా జరిగిన స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజలిస్తున్న వినతిపత్రాలకు రసీదులు ఇవ్వాలని, ఏ తేదీలోపు పరిష్కరిస్తారో వాటిపై రాసివ్వాలని అధికారులకు సీఎం సూచించారు. ఇచ్చిన రసీదులను కంప్యూటరీకరించి బేటా బేస్‌లో పెట్టాలని ఆదేశించారు. వీటిపై కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం సమీక్షించాలన్నారు. నిర్ణీత గడువులోగా అధికారులు ప్రజల సమస్య పరిష్కరిస్తున్నారో, లేదో పర్యవేక్షించాలని సూచించారు. అలాగే కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని, తానూ కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతానని స్పష్టంచేశారు. ప్రతి మంగళవారం అరగంట సేపు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు సిఎం జగన్‌ స్పష్టంచేశారు.
* ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు సీఎం, స్పీకర్ క్లాస్
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు రెండు రోజులపాటు అసెంబ్లీ నిబంధనలపైన, ప్రవర్థానా నియమావళిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ తరగతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అసెంబ్లీ నిర్వహణ తీరు, గౌరవ సభ్యులు ఎలా ప్రవర్థించాలి, తమ ప్రసంగంలో ఎలాంటి అన్ పార్లమెంటరీ పదాలను ఉశ్ఛరించరాదు అన్న అంశాలన్నింటిపైన శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంకు అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎలా వినియోగించుకోవాలో విశదీకరించనున్నారు
* రాజీనామాపై స్పందించిన రఘువీరారెడ్డి
తన రాజీనామాపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశాననన్నారు. తన రాజీనామా లేఖను మే 19వ తేదీనే కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపించినట్లు చెప్పారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూనే ఉన్నానని, అయితే ఇంతవరకూ రాజీనామాపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కాగా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.
*ఏపీలో ఈనెల 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం: కన్నా
పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి కేంద్రం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని పునరుద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. ఈ నెల 6 నుంచి బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపారు.
*తెలంగాణపై అమితాసక్తి!
తెలంగాణలో భాజపాను బలోపేతం చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టిపెట్టారు. సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేసేందుకు సభ్యత్వాల్ని భారీగా పెంచాలని.. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులనీ చేర్చుకోవాలని కమలదళపతి రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే స్పష్టంచేశారు. జులై 6న భాజపా సభ్యత్వ నమోదు దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఆ రోజున వారణాసిలో ప్రధాని మోదీ పాల్గొంటుండగా.. హైదరాబాద్కు అమిత్ షా హాజరుకానుండటం తెలంగాణలో పార్టీ బలోపేతానికి అధినేత ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని భాజపా వర్గాలు చెబుతున్నాయి. అమిత్షా 6వ తేదీ సాయంత్రం శంషాబాద్కు చేరుకుంటారు.
*తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్: శ్రీనివాస్గౌడ్
తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించిందని, రాష్ట్ర అభివృద్ధిపై అక్కసుతో అడ్డుపడేందుకు ఆ పార్టీ నేతలు యత్నిస్తున్నారని రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక, యువజన, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. పార్టీ అవసాన దశకు చేరినా ఆ పార్టీ నేతలకు జ్ఞానం కలగడం లేదని పేర్కొన్నారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ కొత్త సచివాలయం, శాసనసభను రాష్ట్ర ఖ్యాతిని పెంచేందుకు, తరతరాల పాటు అందరికీ ఉపయోగపడేలా కేసీఆర్ నిర్మిస్తున్నారు.
*బస్సులో పయనించిన ఎమ్మెల్యే హరిప్రియ
ప్రతిరోజూ ఖమ్మం నుంచి ఇల్లెందుకు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. తొలుత ఖమ్మం వెళ్లిన ఎమ్మెల్యే మంగళవారం రాత్రి ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లి అక్కడి డిపో మేనేజర్తో మాట్లాడారు. రాత్రి 8 గంటల తర్వాత ఖమ్మం నుంచి ఇల్లెందుకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వెళ్లే బస్సులను ఇల్లెందు మీదుగా నడపాలని కోరారు. దీనికి డీఏం సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ఇల్లెందు వరకు ప్రయాణించారు.
*స్థానికంగానే అభ్యర్థుల ఎంపిక
పురపాలక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేలా కాంగ్రెస్ కార్యాచరణను రూపొందిస్తోంది. స్థానికంగా నాయకత్వ సమస్య లేకుండా చూడటంపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జిల్లా కాంగ్రెస్ కమిటీలకే అప్పగించాలని పీసీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు, స్థానిక కాంగ్రెస్ నేతలే పురపాలక ఎన్నికల్లో క్రియాశీలకం కానున్నారు. రాష్ట్రంలో 72 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మూడు నగరపాలక సంస్థలు 131 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.
*తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్: శ్రీనివాస్గౌడ్
తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించిందని, రాష్ట్ర అభివృద్ధిపై అక్కసుతో అడ్డుపడేందుకు ఆ పార్టీ నేతలు యత్నిస్తున్నారని రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక, యువజన, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. పార్టీ అవసాన దశకు చేరినా ఆ పార్టీ నేతలకు జ్ఞానం కలగడం లేదని పేర్కొన్నారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ కొత్త సచివాలయం, శాసనసభను రాష్ట్ర ఖ్యాతిని పెంచేందుకు, తరతరాల పాటు అందరికీ ఉపయోగపడేలా కేసీఆర్ నిర్మిస్తున్నారు.
*మూసీ ప్రక్షాళన చేపట్టండి: ఎంపీ కోమటిరెడ్డి
తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళన చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్సభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. నదీ ప్రక్షాళనకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. నల్గొండ జిల్లా భూగర్భ జలాల్లో దేశంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ ఉందన్నారు. మూసీ శుద్ధి.. నల్గొండ జిల్లాతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తాగునీటికీ ఉపకరిస్తుందని ఎంపీ పేర్కొన్నారు.
*రైల్వే తయారీ కేంద్రాల కార్పొరేటీకరణపై సోనియా విమర్శ
రాయ్బరేలీలోని మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ సహా రైల్వేలోని తయారీ కేంద్రాలను కార్పొరేటీకరించాలన్న (కార్పొరేటైజేషన్) రైల్వే మంత్రిత్వశాఖ ప్రతిపాదనను యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ మంగళవారం లోక్సభలో వ్యతిరేకించారు. ఈ నిర్ణయం రైల్వేల ప్రైవేటీకరణకు తొలి అడుగు వంటిదని ఆరోపించారు. లోక్సభ శూన్య గంటలో సోనియా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
*పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి
పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి రక్షణ కల్పించి సమస్యను సత్వరమే పరిష్కరించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పోడు భూముల రక్షణ కోసం ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వ దౌర్జన్యాలను ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చాయి. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అధ్యక్షతన పోడు భూముల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో తమ్మినేని వీరభద్రం(సీపీఎం), పి.రంగారావు(సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ), ఉపేందర్రెడ్డి(ఎంసీపీఐ-యూ), జానకిరాములు(ఆర్ఎస్పీ), మురహరి(ఎస్యూసీఐ(సి), విజయ్కుమార్(సీపీఐఎంఎల్), రాజేశ్ (సీపీఐఎంఎల్-లిబరేషన్) తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందం ఆసిఫాబాద్ జిల్లా కొత్త సార్సాలలో బుధవారం పర్యటించాలని సమావేశం నిర్ణయించింది.
*రవాణా శాఖలో వినతుల విభాగం
ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా శాఖ కార్యాలయాల్లో ఓ విభాగం (గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిశీలనకు రాష్ట్ర స్థాయిలో రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా ఫోన్, వాట్సాప్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని రూపొందించాలని మార్గదర్శనం చేశారు.
*8న బీసీ కమిషన్ బృందం హైదరాబాద్కు రాక
బీసీల సమస్యలు తెలుసుకునేందుకు జాతీయ బీసీ కమిషన్ బృందం ఈ నెల 8వ తేదీన హైదరాబాద్కు రానున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఇటీవల దిల్లీలో కమిషన్ ఛైర్మన్ భగవాన్లాల్ సహానిని కలిసి సమస్యలు వివరించి నగరానికి రావాలని కోరామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ విద్యానగర్ బీసీభవన్లో ఆయన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
*ఆ అధికారులకు అప్రాధాన్యమే!
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు చర్యలు మొదలయ్యాయి. అవినీతి ఆరోపణలు ఉన్న సబ్రిజిస్ట్రార్లను అప్రాధాన్య ప్రాంతాలకు పంపించిన అనంతరమే బదిలీలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యం ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గ్రూపు-1 అధికారులను నియమించాలని చెప్పారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు. ఏసీబీ కేసులు నమోదైన వారిని అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని 2017 డిసెంబరులో స్పష్టం చేసినా ఇప్పటివరకు శాఖాపరంగా తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు.
*సాధ్యమైనంత త్వరగా పుర ఎన్నికలు
‘ప్రస్తుతం ఉన్న అవరోధాలన్నీ అధిగమించి సాధ్యమైనంత వేగంగా పుర, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే విషయమై ముఖ్యమంత్రితోనూ చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’ అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక, నగరపాలక సంస్థల కమిషనర్ల సమావేశంలో..అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీల గుర్తింపు ప్రక్రియ పూర్తయినందున రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. పురపాలక, నగరపాలక సంస్థల్లో ఇదివరకే కలిపిన ప్రాంతాలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి ఎన్నికలు నిర్వహిస్తాం. పాలకవర్గాల పదవీ కాలం పూర్తవడంతో పురపాలక, నగరపాలక సంస్థల్లో నియమిస్తున్న ప్రత్యేక అధికారులు ఎన్నికలు నిర్వహించే వరకు కొనసాగుతారు’ అని మంత్రి వివరించారు.
*నాగబాబుకు జనసేన సమన్వయ బాధ్యతలు
జనసేనలో పార్టీ శ్రేణులను, నాయకులను సమన్వయం చేసే బాధ్యతలను పవన్కల్యాణ్ సోదరుడు నాగబాబుకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్లో మంగళవారం కొందరు జనసేన పార్టీ నాయకుల వద్ద ఈ విషయం ఆయన ప్రస్తావించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలోనూ నాగబాబు ఈ బాధ్యత నిర్వహించినట్లు చెబుతున్నారు. పవన్ తానా సభలకు హాజరై తిరిగొచ్చిన తర్వాత విజయవాడలో పార్టీ నాయకులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.
*సాధ్యమైనంత త్వరగా పుర ఎన్నికలు
‘ప్రస్తుతం ఉన్న అవరోధాలన్నీ అధిగమించి సాధ్యమైనంత వేగంగా పుర, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే విషయమై ముఖ్యమంత్రితోనూ చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’ అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక, నగరపాలక సంస్థల కమిషనర్ల సమావేశంలో..అనంతరం విలేకరులతో మాట్లాడారు.
*సుజనా బృందాన్ని పరిచయం చేసిన మోదీ
తెలుగుదేశం పార్టీని వీడి ఇటీవల భాజపాలో విలీనమైన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్రావుతోపాటు ఐఎన్ఎల్డీ ఎంపీ రాంకుమార్ కశ్యప్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహచర భాజపా ఎంపీలకు పరిచయం చేశారు. అందరూ మంచివాళ్లు, దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా మనతో కలిసి పనిచేయడానికి వీరు భాజపాలో విలీనమైనట్లు మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పారు. సుజనాచౌదరి లోగడ ఎన్డీయే మంత్రివర్గంలో పనిచేశారని గుర్తు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్నందున ఎంపీ సీఎం రమేష్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
*రైల్వే తయారీ కేంద్రాల కార్పొరేటీకరణపై సోనియా విమర్శ
రాయ్బరేలీలోని మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ సహా రైల్వేలోని తయారీ కేంద్రాలను కార్పొరేటీకరించాలన్న (కార్పొరేటైజేషన్) రైల్వే మంత్రిత్వశాఖ ప్రతిపాదనను యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ మంగళవారం లోక్సభలో వ్యతిరేకించారు. ఈ నిర్ణయం రైల్వేల ప్రైవేటీకరణకు తొలి అడుగు వంటిదని ఆరోపించారు. లోక్సభ శూన్య గంటలో సోనియా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
*కాపలా ఉండలేమని హోంమంత్రి అంటే ఎలా?
‘ప్రతి చోటా మేము కాపలా ఉండలేమని శాంతిభద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి?’ అని తెదేపా నాయకురాలు దివ్యవాణి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ‘జడ్ప్లస్ భద్రత ఉన్న ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గించిన మాట వాస్తవం కాదా? రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా వ్యవహరించమని మీకు ఆదేశాలు లేవా?’ అని నిలదీశారు. ‘ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా మహిళకు అవకాశం దక్కిందని సంతోషించా. ఆ ఆనందం నెలలోనే ఆవిరైంది. అధికారుల బదిలీలపై ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపైనా ఉంచాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.