DailyDose

కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట-తాజావార్తలు–07/03

KCR Gets Relief From High Court - Daily Breaking News - July3 2019

* సచివాలయ భవనాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాకలు చేసిన పిటిషన్‌ను బుధవారం నాడు హైకోర్టు విచారించింది.
ప్రభుత్వ పాలసీ విధానాలపై తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు గత నెల 27వ తేదీన కేసీఆర్ భూమిపూజ కూడ చేశారు.అయితే సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొంటే అప్పుడు తాము జోక్యం చేసుకొంటామని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి కూడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సచివాలయ భవన నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకొంటామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
* ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగిన ప్రతీ చోటా కాపలా ఉండలేమని హోం మంత్రి చేసిన వ్యాఖ్యలపై విశాఖపట్నంకు చెందిన రాం మహారాజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ లు చేశాడు. ఈ పోస్ట్ లపై అశోక్ కుమార్ అనే వైసీపీ కార్యకర్త ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశాడు.
* చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్‌లోకి వివో జెడ్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. వివో జెడ్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ రూ.  లభించనుంది. వివో ఫోన్ఫ్లిప్‌కార్ట్వివో ఇండియా ఈ-స్టోర్లలో లభిస్తోందని సంస్థ తెలిపింది.
* సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నెల 21, 22 తేదీల్లో బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల ఏర్పాట్లపై ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో తలసాని మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత పండుగ వైభవం మరింత పెరిగిందన్నారు. బోనాల ఉత్సవాలకు గతేడాది కంటే ఈ సారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకామున్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను తలసాని ఆదేశించారు. సమీక్షలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్ మాట్లాడుతూ..అన్ని శాఖల సమన్వయంతో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. 30 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో ఇప్పటికే పనులు ప్రారంభించామని, ఈ నెల 15వ తేదీకల్లా పనులు పూర్తి చేస్తామన్నారు. ‌సమీక్షలో పోలీస్ ఉన్నతాధికారులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు
* ప్రముఖ పారిశ్రామికవేత్త, సెంచరీ టెక్స్‌టైల్స్‌ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ , కుమార్ మంగళం బిర్లా తాత బసంత్‌ కుమార్‌ బిర్లా (బీకే బిర్లా 98) బుధవారం ముంబైలో కన్నుమూశారు. బి.కె.బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కళాశాల నడుపుతున్న కృష్ణార్పణ్‌ ఛారిటీ ట్రస్ట్ చైర్మన్ కూడా అయిన బిర్లా ఖతార్‌లోని బిర్లా పబ్లిక్ స్కూల్‌, ముంబై సమీపంలోని కళ్యాణ్‌లో బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్‌ కామర్స్ స్థాపించారు.
*ఆర్టీజీఎస్‌ సీఈవో బాబు.ఎ ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బాబును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌గా ఐపీఎస్‌ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌కు నూతన బాధ్యతలు అప్పగించారు.
* దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజైన మంగళవారం కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో మహానగరంలో జనజీవనం స్తంభించింది.
*తెలంగాణలోని తొమ్మిది, పది షెడ్యూలు సంస్థల స్థితిగతులపై ముఖ్యమంత్రి కేసీఆర్కు బుధవారం నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ ఆధ్వర్యంలో మొదలైన కసరత్తు బుధవారంతో ముగియనుంది.
*గోదావరి జలాలను కృష్ణా పరీవాహకానికి తరలించేందుకు అనువైన మార్గాల అన్వేషణలో భాగంగా నీటిపారుదలశాఖ నియమించిన ఇంజినీర్ల కమిటీ కసరత్తు ప్రారంభించింది. గోదావరి-శ్రీశైలం అనుసంధానంపై ఇప్పటివరకూ ఉన్న ప్రతిపాదనలకు తోడు మరిన్ని అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు ఇంజినీర్లు కసరత్తు చేపట్టారు.
*జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం చండ్రుపల్లిలో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. గ్రామం వద్ద పంట పొలంలో బోరు తవ్వకాలు చేపట్టిన సర్పంచి సురేందర్..మొదట్లో నీటికి బదులుగా బొగ్గు బయటపడటాన్ని గమనించారు. మరింత లోతుకు తవ్విన తర్వాతే నీరు బయటకు వచ్చింది.
*తెలంగాణలోని తొమ్మిది, పది షెడ్యూలు సంస్థల స్థితిగతులపై ముఖ్యమంత్రి కేసీఆర్కు బుధవారం నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ ఆధ్వర్యంలో మొదలైన కసరత్తు బుధవారంతో ముగియనుంది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాతి చిత్రాల తావు వెలుగుజూసింది. ములకలపల్లి మండలం జగన్నాథపురం నుంచి అన్నపురెడ్డిపల్లి వెళ్లే మార్గంలో నల్లముడి గ్రామానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఈ తావు(ప్రాంతం) కనిపించింది. కె.గోపీవరప్రసాద్రావు, కట్టా శ్రీనివాస్ అన్వేషణలో ఈ విషయం బయటపడింది.
*సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో రెండు గుడ్డెలుగు(ఎలుగుబంటి) పిల్లలు వ్యవసాయ బావిలో పడ్డాయి. మంగళవారం ఉదయం అటువైపుగా వెళ్లిన రైతులకు.. తన పిల్లల కోసం బావిపైన తల్లి గుడ్డెలుగు అటూఇటూ తిరుగుతూ కనిపించింది. వారిని చూసి అది సమీపంలోని గుట్టల వైపు పారిపోయింది. పిల్లలు రెండూ బావిలోని ఒక సొరికలో దాక్కున్నాయి. వాటిని బయటకు రప్పించేందుకు అటవీ అధికారులు తాడు, వలలతో శతవిధాలా ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో కర్రలతో నిచ్చెన తయారు చేయించి బావిలోకి దించారు. రాత్రిపూట అవి బయటకు వచ్చి తమ ఆవాసానికి వెళ్తాయని డీఎఫ్వో శ్రీధర్రావు తెలిపారు.
*అటవీ భూములకు, ఆ శాఖ సిబ్బందికి రక్షణ కల్పించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. మంగళవారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి.. హోంమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. కొత్తసార్సాల ఘటన దురదృష్టకరమని, నిందితులు ఎవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అటవీ సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలకు ఆయన హామీ ఇచ్చారు.
*తెలంగాణలో క్రీడాసంస్కృతిని మరింత మెరుగుపర్చేందుకు జిల్లాల్లో నూతన స్టేడియాలను నిర్మిస్తామని రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ‘ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్’ 9వ ఎడిషన్ను ఆగస్టు 24, 25వ తేదీల్లో నగరంలో నిర్వహించనున్నారు.
*ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతుండటంతో.. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాలు లభించిన విద్యార్థుల ‘రిపోర్టింగ్’ను ‘జోసా’ కౌన్సెలింగ్లో అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇంటర్మీడియట్లో ఫెయిలై జేఈఈలో ర్యాంకు పొందిన విద్యార్థుల్లో కొందరికి జోసా తొలి రౌండ్ కౌన్సెలింగ్లో ప్రవేశం లభించింది.
* ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గురువారం నుంచి రాష్ట్రంలో 3 రోజులపాటు ఒక మాదిరి లేదా తేలికపాటి వర్షాలు పడతాయన్నారు.
*దోస్త్ 1, 2, 3వ విడతల్లో సీట్లు పొంది ఆన్లైన్ ద్వారా ఐచ్ఛికాలు ఇచ్చుకున్న విద్యార్థులు ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు స్వయంగా కళాశాలలకు వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించాలని దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి సూచించారు. అలా చేయకుంటే విద్యార్థులు సీట్లుకోల్పోతారని హెచ్చరించారు.
*డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేరుగా డిగ్రీ చదువుకోవాలనుకొనే వారి కోసం నిర్వహిస్తున్న అర్హత పరీక్ష-2019కు దరఖాస్తు చేసుకోవడానికి రెండోసారి అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాయి.
*తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన పూర్తి వివరాల్ని సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంత మందితో భద్రత కల్పించారు? ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు? అన్నది పోల్చిచెప్పాలని స్పష్టం చేసింది.
*ఆర్థిక సంఘం(14వ) గ్రాంట్ల రూపంలో 2015-16 నుంచి 2019-20 వరకు ఏపీ పంచాయతీలకు రూ.8654.09 కోట్లు, తెలంగాణలోని పంచాయతీలకు రూ.5375 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. తెరాస సభ్యుడు నామా నాగేశ్వరరావు, తెదేపా సభ్యుడు రామ్మోహన్నాయుడు లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొంది.
*రానున్న ఐదేళ్లలో బొగ్గు పరిశ్రమ కొత్త సవాళ్లను ఎదుర్కోనుందని, ఉత్పత్తి వ్యయం తగ్గించుకుంటేనే కోల్ ఇండియాతో పోటీపడి సింగరేణి నిలబడుతుందని సంస్థ సీఎండీ శ్రీధర్ చెప్పారు. సింగరేణి గనుల్లో లాభదాయక బొగ్గు నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 10గనుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన సంబంధిత అంశాలపై కార్మిక సంఘం నేతలతో చర్చించారు.
*భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధ్వర్యంలో తొలి సారిగా రెండు ఆధార్ సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దిల్లీ, విజయవాడల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికి దేశవ్యాప్తంగా మొత్తం 114 ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
*ఆర్థిక సంఘం(14వ) గ్రాంట్ల రూపంలో 2015-16 నుంచి 2019-20 వరకు ఏపీ పంచాయతీలకు రూ.8654.09 కోట్లు, తెలంగాణలోని పంచాయతీలకు రూ.5375.29 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. తలసరి సగటున రూ.488 చొప్పున ఆర్థికసాయం చేసినట్లు తెరాస సభ్యుడు నామా నాగేశ్వరరావు, తెదేపా సభ్యుడు రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మంగళవారం లోక్సభలో సమాధానమిచ్చారు.
*రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో 2019-20 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశాలకు 40,556 మంది దరఖాస్తు చేసుకున్నారు.
*రిజర్వేషన్లు, బోధన రుసుములపై త్వరలో స్పష్టత ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ సీట్లు కేటాయించేలోపు అన్ని సమస్యలు పరిష్కరించాలని ఉన్నతవిద్యామండలి కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చామన్నారు.
*తహశీల్దార్ల సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ తహశీల్దార్ల సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేశామని గౌరవ అధ్యక్షురాలు వనజాక్షి వెల్లడించారు.
*తనపై కోటీ అనే వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును సీఐడీ లేదా సీబీఐకి బదిలీ చేయాలంటూ వైకాపా ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి వేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.