DailyDose

గ్రామదేవతల వ్యవస్థ ఇది

This is how temple deities system in Indian villages work

1.మన గ్రామదేవతల ప్రాముఖ్యత ఇది?- ఆద్యాత్మిక వార్తలు
**గ్రామదేవతా వ్యవస్థ
గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను #గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా – అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు కచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.
***గ్రామదేవతల ఆవిర్భావము
పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.
**పృధ్వీ దేవత
పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన పృధ్వినీ దేవతను #కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో #గోగులమ్మని యేర్పాటు చేసారు. జొన్నలు పండేచోట #జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో #నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి #అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.
**జల దేవత
జలానికి సంభందించిన తల్లి #గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
**అగ్ని దేవత
మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా #పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).వాయు దేవత:నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.ఆకాశ దేవత:ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన. ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.
****గ్రామదేవతా నామ విశేషాలు
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా #పోలేరమ్మ అయింది.ఎల్ల’ అంటే సరిహద్దు అని అర్దము అందుకే ‘#ఎల్లమ్మ’ కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి ‘పోచ+అమ్మ=పోచమ్మ’ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, #పోచమ్మ పోషణ కలిగిస్తుంది.ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే ‘కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో #కట్టమైసమ్మ అయింది.స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి #అచ్చమ్మగా అయ్యింది.సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. ‘మా వూళ్ళన్నింటికీ అమ్మ’ అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది #మావుళ్ళమ్మ’ అయింది.ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి #తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె ‘తలుపులమ్మ’గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ, #అంకాళమ్మ గా మారిపోయింది.పొలిమేరలో వుండే మరొక తల్లి #శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి #పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే ‘#నాగేశ్వరమ్మ’ అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి #పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే ‘సుబ్బ+అమ్మ=#సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి #బతుకమ్మ.గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= #సత్తెమ్మ. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ #పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా #అప్పలమ్మ అయినది. #బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు.అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= #పెంటమ్మ.భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= #బోనాలమ్మ.అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను ‘#అయ్యమ్మ’ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= #గుర్రాలమ్మ అయినది.ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ=’సోమపోలమాంబ’ అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.
2. తిరుమలేశుడి జూన్ హుండీ ఆదాయం రూ.100 కోట్లు
తిరుమలేశుడికి జూన్ నెలలో రూ.100.37 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. 24.66 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. 1.13 కోట్ల లడ్డూలను తితిదే అందజేసింది. స్వామివారి ఆర్జిత సేవలకు సంబంధించి అక్టోబరు మాసానికి 55,355 టికెట్లను శుక్రవారం తితిదే విడుదల చేసింది.
3. షిర్డీలో వెలమ భవన్కు స్థలమివ్వాలి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన షిర్డీలో వెలమ సంక్షేమభవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని తెరాస ఎమ్మెల్సీ, వెలమ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు టి. భానుప్రసాదరావు కోరారు. సంఘ ఇతర నాయకులతో కలిసి ముంబయికి వెళ్లిన ఆయన శుక్రవారం మహారాష్ట్ర రాజ్భవన్లో గవర్నర్ విద్యాసాగర్రావును, వర్షభవన్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్లను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. తగినంత స్థలం కేటాయిస్తే అన్ని వసతులతో అతిథి గృహాన్ని నిర్మిస్తామని తెలిపారు. తమ వినతికి వారిద్దరూ సానుకూలంగా స్పందించారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
4. శ్రీశైలంలో వరుణ యాగం
శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం నిర్వహిస్తున్న కారీరీష్టి(వరుణ)యాగం శనివారం పూర్ణాహుతితో ముగియనుంది. శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న యాగాన్ని ఈవో శ్రీరామచంద్రమూర్తి పర్యవేక్షించారు. ఈ హోమ క్రతువులో నల్లటి గుర్రాన్ని, పొట్టేలును మంత్రజలంతో సంప్రోక్షించారు. పండితులు నల్లని దుస్తులు ధరించి హోమాన్ని నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది.
5. 8 నుంచి పెద్దమ్మతల్లి శాకంబరీ ఉత్సవాలు
జూబ్లీహిల్స్ లో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి శాకంబరీ ఉత్సవాలు జూలై 8నుంచి 10వ తేదీ దాకా కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ప్రతియేటా అషాఢమాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,పూలతో అలంకరించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 8న తెల్లవారుజామున 3 గంటలకు పెద్దమ్మతల్లికి అభిషేకం, 6గంటలకు దర్శనం, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, పంచగవ్వ ప్రాశన, ఋత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు, సాయంత్రం 8గంటలకు పెద్దమ్మ తల్లికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. జూలై 9న ఉదయం 10గంటలకు సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. జూలై 10న విశేషపూజల అనంతరం నవగ్రహహోమం, రుద్ర, చండీహోమం, బలిహరణం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాత్రి 9గంటలకు దేవస్థానంలో అలంకరించిన కూరగాయలను భక్తులకు వితరణ చేస్తారని ఆలయ ఫౌండర్ ట్రస్టీ పి. విష్ణువర్దన్రెడ్డి తెలిపారు.
6. పొహండిగా గుండిచా ఆలయంలోకి..
జగన్నాథ, బలభద్ర, సుభద్రల(ముగ్గురు మూర్తులు) గుండిచా ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వైభవంగా పొహండి నిర్వహించారు. జై జగన్నాథ అన్న అసంఖ్యాక భక్తుల ప్రార్థనల మధ్య ఈ వేడుక నేత్రపర్వం చేసింది. ఆనవాయితీ ప్రకారం గుండిచా చేరిన ముగ్గురుమూర్తులకు పెంచినతల్లి ఆలయంలోని అడప మండపంపై ఆసీనులను చేసింది. ఈ వేడుక ప్రతీసారి చీకటి పడిన తర్వాత జరగాల్సి ఉండగా ఈసారి ముందుగానే నిర్వహించారు. శనివారం నుంచి పురుషోత్తమ దర్శనం గుండిచా మందిరంలోనే జరుగుతుంది. శనివారం నుంచి ఇక్కడ స్వామి ఒబడా (మహాప్రసాదం)తోపాటు మరో 56 రకాలు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయి. గుండిచా మందిరంలో అర్పణయ్యే మహాప్రసాదం శుభకరం, ఫలప్రదమని అంటారు. ఈ నేపథ్యంలో పొహండిలో భాగంగా గట్టి భద్రత మధ్య రథాలపై ఆసీనమై ఉన్న దేవదేవుళ్లను గుండిచా మందిరానికి
తరలించారు. 4 గంటలకు ప్రారంభమైన ఈ వేడుక రెండు గంటలపాటు సాగింది. ఇక గుండిచా ఆలయంలో శుక్రవారం ముగ్గురుమూర్తుల సేవల విషయానికొస్తే.. ● ఉదయం 6 గంటలు: గుండిచా ఆవరణలో రథాలపై ముగ్గురుమూర్తులకు మంగళహారతి● 6.30: మైలం, తిలకధారణ ● 7.00: అబకాశ ● 7.30: రథాలపై దేవదేవుల దర్శనం ● 9.15: సూర్యపూజ ● 9.30: ద్వారపాల పూజ ● 9.30 నుంచి 10.30: జగన్నాథుని గోపాలవల్లభ సేవ ● 10.40: దూపదీపనైవేద్య సమర్పణ ● మధ్యాహ్నం 1.45 గంటలకు మైలం ● 2.00: మంగళహారతి ● 4.00: ముగ్గురుమూర్తుల గుండిచా ఆలయ పొహండి ● పెంచిన తల్లి మందిర ప్రవేశం తర్వాత ఇతర గోప్యసేవలు రాత్రి వరకు.. ● శనివారం ఉదయం నుంచి గుండిచా మందిరంలో భక్తులకు స్వామి దర్శన సౌకర్యం.
7. రథయాత్ర నిర్వహణ భేష్
ఈఏడాది విశ్వప్రసిద్ధ పూరీ రథయాత్ర ప్రశాంతంగా ఏర్పాటైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు. నిర్ణీత వ్యవధికి ముందుగా ముగ్గురుమూర్తుల సేవలు ఏర్పాటు కావడం, రథాలు గుండిచా మందిరానికి చేరుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సేవాయత్ల వ్యవహారశైలిపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. వీరిని కట్టడి చేయడంలో యంత్రాంగం గట్టిగా వ్యవహరించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని యాత్రికులు ఈసారి సంతృప్తి వ్యక్తం చేశారు.సమిష్టి విజయమిది: శ్రీక్షేత్ర పాలనాధికారి ప్రదీప్తకుమార్ మహాపాత్ర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఫొని తుపాను పూరీకి తీవ్రనష్టాలు తెచ్చిందని, ఆలయంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఒక సవాల్గా తీసుకుని కార్యాచరణ ప్రారంభించామన్నారు. ఒకవైపు శ్రీక్షేత్రం లోపల మరమ్మతులు, మరోవైపు రథయాత్ర పనులకు ప్రాధాన్యమిస్తూ సమష్టిగా ముందుకు సాగామన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని శాఖల అధికారులు దీన్నో యజ్ఞంలా చేపట్టారని తెలిపారు. సేవాయత్లలో మార్పు వచ్చిందని, యంత్రాంగం ఇటీవల కాలంలో చేపట్టిన చర్యలు, పూరీ రాజు గజపతి దివ్యసింగ్దేవ్ బోధనలు వారిని ప్రభావితం చేశాయన్నారు. దీంతో వారు తమ సేవలు నిరాటంకంగా కొనసాగించారని చెప్పారు. సకాలంలో అన్ని సేవలూ చేపట్టినందున యాత్ర విజయవంతమైందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, సమీప భవిష్యత్తులో చేయాల్సిందెంతో ఉందని, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన యంత్రాంగం ఆలయాభివృద్ధి, భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయనుందని చెప్పారు.
8. శుభమస్తు తేది : 6, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి
(నిన్న సాయంత్రం 4 గం॥ 10 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 11 ని॥ వరకు)
నక్షత్రం : మఖ
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 19 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 12 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కరణం : భద్ర (విష్టి)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 42 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 10 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 17 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 27 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 23 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 40 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 24 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : సింహము
9. చత్రలో ఈ రోజు/జూలై 6*మలావి స్వాతంత్ర్యదినోత్సవం.
1901 : జనసంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, కోల్‌కత విశ్వవిద్యాలయం మాజీ కులపతి, మాజీ కేంద్ర మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ జననం (మ.1953).
1930 : ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం.(మ.2016)
1935 : టిబెట్ దేశీయుల మతగురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, 14వ దలైలామా జన్మించాడు.
1946 : అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్ జననం.
1986 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త , దేశానికి ఉపప్రధానిగా పనిచేసిన జగ్జీవన్ రాం మరణం (జ.1908).
1885 : లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ ని మొట్టమొదటి సారిగా వాడారు
10. తిరుమల \|/ సమాచారం* *_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు శనివారం.
*06.07.2019*
ఉదయం 5 గంటల
సమయానికి,
_తిరుమల: *23C° – 33℃°*_
• నిన్న *72,488* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ
భక్తులతో నిండినది, భక్తులు
బైట చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*20* గంటలు పట్టవచ్చును
• నిన్న *37,214* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.33* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
ఐదు గంటల సమయం
పట్టవచ్చును,
*_వయోవృద్దులు మరియు దివ్యాంగుల_*
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
*_చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*
11. తిరుమ సమాచారం**ఓం నమో వేంకటేశాయ*
ఈరోజు శనివారం *06-07-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ……
శ్రీవారి దర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు…
శ్రీ వారి సర్వ దర్శనానికి *20* గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *6* గంటల సమయం పడుతోంది..
నిన్న జూన్ *05* న *72,488* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *3.33* కోట్లు.
12. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కంపార్ట్‎మెంట్లలో వేచివున్నారు. కంపార్టుమెంట్లన్నీ నిండటంతో క్యూలైన్ వెలుపలకి వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
13. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లా శ్రీఖండ్ మహదేవ్ యాత్ర ఈ నెల 15వతేదీనుంచి 25 వ తేదీ వరకు సాగనుంది.సముద్రమట్టానికి 18,570 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాలపై 72 అడుగుల ఎత్తు ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు శ్రీఖండ్ యాత్ర చేపడుతున్నారు. హిమాలయాలపై ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న సింగ్ హడ్ బేస్ క్యాంపు నుంచి శ్రీఖండ్ యాత్ర ప్రారంభం కానుంది. యాత్రికులు 32 కిలోమీటర్ల దూరం యాత్రను పదిరోజుల్లో పూర్తి చేస్తారు. శ్రీఖండ్ యాత్ర ట్రస్టుతోపాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కుల్లూ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా ఈ యాత్ర కోసం ఏర్పాట్లు చేసింది. ఈ యాత్రలో ఆరు కిలోమీటర్ల దూరం పూర్తిగా హిమాలయాలను పూర్తిగా మంచు కప్పబడి ఉంటుంది.
14. ప్రహ్లద సమేత స్వయంభూగా వేలశి యున్నక్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్ఫోన్ నెం : 08494 – 221066, 221366 06.07.2019 వతేది, *శనివారము ఆలయ సమాచారం*
*_శ్రీస్వామి వారి దర్శన వేళలు_*
ఉదయము 5.30 గంటలకై అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును. స్వామి వారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు.. తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును.. రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ. 12.40 నుండి 2.00 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.00 నుండి 6.30 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 6.30 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం గును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు*
*06.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 35_*
*06.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్: 5_*
15. టీటీడీ హుండీ సరికొత్త రికార్డు
టీటీడీలో సరికొత్త రికార్డ్‌ నమోదైంది. ఒకే నెలలో శ్రీవారి హూండీ ఆదాయం రూ.100కోట్లు దాటింది. జూన్‌లో శ్రీవారిని 24.66 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. జూన్‌లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.100.37కోట్లు రాగా.. గత ఏడాది జూన్‌లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.91.81 కోట్లు నమోదైంది