Movies

నిత్యా కనెక్ట్స్

Nitha Menen Wants To Stay Connected Via Hearts

‘ఆర్టిస్టులను ప్రేక్షకులు చూసే కోణం వేరు, మమ్మల్ని మేము చూసుకునే కోణం వేరు. అందరికీ నేను నటి నిత్యా మీనన్ని కావచ్చు. కానీ నాకు కాదు’’ అంటారు నిత్యా మీనన్. షూటింగ్ లేని రోజు లేదా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఈ బ్యూటీ ఏం చేస్తారో తెలుసా? ఆ విషయం గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ – ‘‘నటిగా నా మీద ప్రేక్షకులకు కొన్ని అంచనాలు, అభిప్రాయాలు ఉండొచ్చు. అవన్నీ బయట నుంచి చూస్తూ ఏర్పరుచుకున్నవి.నా వరకూ నేను నటి నిత్యను కాదు. నార్మల్గా నాలాగే ఉండాలనుకుంటాను. నాతో నేను క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటాను. షూటింగ్ చేస్తున్న సమయంలో చాలా అలసిపోతాం. కోల్పోయిన శక్తినంతా ఖాళీ సమయాల్లో తిరిగి సంపాదించుకుంటాను. సెల్ఫోన్ బ్యాటరీలు రీచార్జ్ చేసుకున్నట్టే ఇది కూడా (నవ్వుతూ). మనతో మనం కనెక్ట్ అయితేనే నేచర్తో కనెక్ట్ అవగలం. నా శక్తినంతా నేచర్ నుంచి తెచ్చుకుంటాను. కేవలం శక్తి మాత్రమే కాదు నా ఇన్స్పిరేషన్ కూడా నేచరే’’ అన్నారు.