Devotional

జంధ్యాల పూర్ణిమ

Jandhyala Purnima Special

1. జంధ్యాల పూర్ణిమ – ఆద్యాత్మిక వార్తలు 08/13
భారతావని మొత్తం శ్రావణ పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తుంది. ఏడాదికి ఒకసారి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లో శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని (యజ్ఞోపవీతం) ధరించే వారందరూ ఈ రోజు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే ‘ ఉపాకర్మ’ అని కూడా అంటారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యానే్న ‘యజ్ఞోపవీతం’ అని కూడా అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమన ఈ పూర్ణిమని ‘నూలి పున్నమి’ అన్నాడు. నూలుతో తయారుచేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. ఉపాకర్మ వేదాధ్యయనానికి ప్రతీక. వేదాధ్యయనం చేసేందుకు ముందు ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం ఆచారం. యజ్ఞోపవీతధారణ ఉన్నవారిని ‘ద్విజులు’ అని పిలుస్తారు. ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు. తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం చేసిన అనంతరం ‘జ్ఞానాధ్యయనం’ గురువు నుంచి నేర్చుకోవడం రెండో జననంగా చెప్పబడుతుంది. ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమినాడు తీసి వేస్తారు. ఉపనయనం అయినవారు ఈ రోజు గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ జంధ్యాల పూర్ణిమ కేవలం ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు అష్టోత్తరాలతో గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. పవిత్రతకు, దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకుని, వేసుకునే ముందు..
‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజా పతేః యత్ సహజం పురస్తాత్
ఆయుష్య మర్య్రం, ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః’
అనే శ్లోకాన్ని పఠించి ధరించాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత (జీర్ణ) యజ్ఞోపవీతాన్ని ఈ కింది శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను.
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం
వేదాంతవేద్యం, పరబ్రహ్మమూర్తిం
ఆయుష్య మాగ్య్రం, ప్రతి ముంచ శుభ్రం
జీర్ణోపవీతం విసృజామి తేజః॥
ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను. మనం వేసుకునే జంధ్యం 96 బెత్తాలుండాలి. మూడు పోగులుండాలి. వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు. ఒంటి ముడి ఉండాలి. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని ‘బ్రహ్మముడి’ అంటారు. యజ్ఞోపవీతాన్ని బ్రహ్మదేవుడు తయారుచేయగా లోకసంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా, లయ కారకుడు ముడివేయగా, సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు. జంధ్యం నాభి వరకే ఉండాలి. నాభి కిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది. నాభి పైకి ఉంటే ఆయుష్షు నశిస్తుంది.
జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పలుచగా ఉంటే ధన హాని కలుగుతుంది. నవ తంతువుల్లో ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు, ఇతర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు. పురుషులకే కేటాయించిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరిసంపదలు, ధన ధాన్యాదులు రెట్టింపవుతాయి. బ్రాహ్మణులు, పండితులకు జంధ్యాలు ఇవ్వడం మంచిది. గాయత్రీమాత ఉపాసన, హోమం విశేష ఫలితాన్నిస్తాయి. అందుకే ఈ రోజు పనె్నండు సంవత్సరాల లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిస్తారు.
2. ఆదుకో మల్లన్నా! -శ్రీశైలంలో భక్తులకు ఇబ్బందులు
శ్రీశైల క్షేత్రంలో ఆది, సోమవారాల్లో భక్తులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వరుస సెలవులు కావడంతో సందర్శకులు లక్షలాదిగా తరలివచ్చారు. వసతి గదులు దొరక్క రహదారులపైన, వాహనాల్లోనే సేదతీరారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల దగ్గరా తీవ్ర రద్దీ నెలకొంది. సోమవారం ఉదయం శ్రీశైలంలోని బంకుల్లో పెట్రోల్ అయిపోయింది. చేసేది లేక వాహనదారులు తమ తిరుగు ప్రయాణాన్ని విరమించాల్సి వచ్చింది. వలయ రహదారితో పాటు మిగిలిన దారులన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. భారీగా ట్రాఫిక్జాం ఏర్పడింది. సందట్లో సడేమియా లాగా ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక రుసుములు వసూలు చేశారు.
3. అమరేశ్వరుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
పంచారామ క్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్. సూర్యనారాయణ సోమయాజులు కుటుంబ సమేతంగా సందర్శించారు. బాల చాముండికా సమేత అమరేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ రుత్వికులు, స్వామివారి చిత్రపటాన్ని, శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను హైకోర్టు న్యాయమూర్తికి అందజేశారు.
4. వైభవంగా శోభనాచలుని ఉత్సవాలు
ఆగిరిపల్లిలోని శ్రీ శోభనాచల వ్యాఘ్రలక్ష్మీనరసింహ స్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి స్వామి వారికి విశేష అర్చన, చతుర్దశ కలశారాధన, స్నపన, అగ్నిఆరాధనలు, శ్రీలక్ష్మీనృసింహ సుదర్శన మూలమంత్ర హోమం, ఉదయం 11 గంటల నుంచి స్వామి వార్లకు, ఉపాలయ మూర్తులకు పవిత్రముల సమర్పణ, సాయంత్రం నవకుంభారాధన, మహాశాంతి వంటి తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాళ్లబండి సాయి వరప్రసాద్ దంపతులు, వై.భానురామ్మూర్తి దంపతులు, వై.అయ్యప్ప ప్రవీణ్ దంపతులు, మద్దూరి సత్యకుమార్ దంపతులు, సీహెచ్ వెంకట నాగ శివకుమార్ దంపతులు, పత్రి బింధు మాధవరావు, రాఘవేంద్ర ప్రమీల దంపతులు, ఎం.వెంకట సుబ్రమణ్య దివాకర్, సావిత్రి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి జోగి రాంబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
5. శ్రీవారి పాదాలకు ఛత్రస్థాపనోత్సవం
తిరుమల పర్వత శ్రేణుల్లోనే అత్యంత ఎత్తైన శిఖరంగా భాసిల్లుతున్న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపన మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకను గాలి గొడుగు ఉత్సవంగానూ పిలుస్తారు. శ్రీనివాసుడు భూలోకానికి ఏతెంచినప్పుడు తొలిసారిగా పాదాలు మోపిన దివ్యస్థలంగా నారాయణగిరి శిఖరం ప్రసిద్ధిగాంచింది. నారాయణగిరి పాదాల చెంత ఈ ఛత్రస్థాపన మహోత్సవాన్ని తితిదూ ఏటా నిర్వహిస్తుంది. శ్రీవారి పాదాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం, పూజాదికాలు పూర్తిచేసి.. నూతన ఛత్రాన్ని ప్రతిష్ఠింపజేశారు. భక్తులకు ప్రసాదాలు అందించారు. సాధారణంగా ఈ సమమంలో గాలి ఎక్కువగా వీస్తుంటుంది. వాయుదేవుణ్ని ప్రసన్నం చేసుకొనేందుకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి.. కొత్త గొడుగును ఏర్పాటు చేశారు. ఈ గొడుగును వచ్చే ఏడాది ఛత్రస్థాపనోత్సవం సమయంలో మార్చి కొత్తది ప్రతిష్ఠిస్తారు. ఈ ఉత్సవంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పార్పత్తేదారు శశిధర్ పాల్గొన్నారు.
6. బ్రహ్మాండ నాయకుడికి భక్తుల బ్రహ్మరథం
బ్రహ్మాండ నాయకుడైన భద్రాద్రి రామయ్యతండ్రికి భక్తులు బ్రహ్మరథం పట్టారు. పవిత్రోత్సవాల్లో భాగంగా అతి ముఖ్యమైన అభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తి భావాలు వెల్లివిరియగా క్రతువు కమనీయంగా సాగింది. సోమవారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ఆరంభమయ్యాయి. ప్రధాన ఆలయంలో దేవ దేవుణ్ని ముత్తంగి రూపంలో అలంకరించి సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన చేశారు. నిత్య కల్యాణాన్ని, పవళింపు సేవను నిలిపేసి బేడా మండపం ప్రాంగణంలో పవిత్ర ఉత్సవాలను చూడముచ్చటగా కొనసాగించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పటిక బెల్లం వంటి వాటితో పంచామృత అభిషేకం చేయడంతో చూపరులకు నయనాందం కలిగించింది. నారీకేళ జలం, తొమ్మిది రకాల ఫలరసాలు, లవణోదకం, గంధోదకం, హరిద్రోదకం, చెరకు రసం, వర్షపు నీళ్లు, సమస్తనదీ జలాలు, తటాకాల జలంతో అభిషేకం నిర్వహించిన తీరు మంత్రముగ్ధులను చేసింది. ద్రవిడ శ్లోకాలను పరిస్తూ పంచ ఉపనిషత్తు నిర్వహిస్తూ మహాకుంభ ప్రోక్షణ చేశారు. హారతులు అందించి పవిత్రాలను అన్ని మూర్తులకు అలంకరించారు. సాయంత్రం దర్బారు సేవ పరమానందంగా సాక్షాత్కరించింది. ఈ ఏర్పాట్లను ఈవో తాళ్లూరి రమేశ్బాబు సూచనలతో ఏఈవో శ్రావణ్కుమార్ పర్యవేక్షించారు. మంగళవారం హవనం ఉంటుందని స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్ తెలిపారు.
7. జమలాపురంలో ముగిసిన పవిత్రోత్సవాలు
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం పుణ్యక్షేత్రంలో పవిత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. పవిత్రధారణ, యుక్తహవనం, బలిహరణ అనంతరం అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో మహా పూర్ణాహుతి నిర్వహించారు. మేళతాళాలు, వేదమంత్రాలతో జయజయ ధ్వనుల మధ్య సుదర్శన చక్రపెరుమాళ్లతో శ్రీవారి పుష్కరిణిలో ఉత్సవమూర్తులకు అవబృద స్నానం నిర్వహించారు. ఆలయంలో శాంతి కల్యాణం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఆలయ ధర్మకర్త ఉప్పల వెంకటజయదేవశర్మ, ఈవో ఉదయ్భాస్కర్, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, పర్యవేక్షకులు శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
8. శుభమస్తు తేది : 13, ఆగష్టు 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : త్రయోదశి
(నిన్న ఉదయం 12 గం॥ 10 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 48 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 53 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 19 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 26 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 10 గం॥ 16 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 1 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 19 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 6 ని॥ వరకు
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 58 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 43 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : ధనుస్సు
9.చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 13* పంచ ఎడమచేతివాటం ప్రజల దినం
1910 : పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య జననం (మ.1975).
1910 : ప్రముఖ సమాజ సేవకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ మరణం (జ.1820).
1932 : భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త సి.రంగరాజన్ జననం.
1936 : తెలుగు మరియు తమిళ సినిమా నటి వైజయంతిమాల జననం.
1954 : రేడియో పాకిస్తాన్ మొదటిసారిగా పాకిస్తాన్ జాతీయగీతం ను, ప్రసారం చేసింది.
1961 : ప్రసిద్ధి చెందిన బెర్లిన్ గోడ ప్రారంభించారు. (1989 లో దీనిని కూలగొట్టి, తూర్పు, పశ్చిమ బెర్లిన్ నగరాలను ఏకం చేశారు).
1963 : భారతీయ సినిమా నటి శ్రీదేవి జననం.
1994 : సుప్రసిద్ద తెలుగు నటుడు రావు గోపాలరావు మరణం (జ. 1937).
2004 : స్వేచ్ఛా నకలు హక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి వికీబుక్స్ ప్రారంభం.
10.*ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
email: endow-eokadiri@gov.in, ac_eo_kadiri@yahoo.co.in
13.08.2019 వతేది, *మంగళవారము ఆలయ సమాచారం*
*_శ్రీస్వామి వారి దర్శన వేళలు_*
ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండును అనంతరము ఉదయం 7.30 గం|| నుండి అర్జిత అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు…
మి వారి దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 గంటలకు వుండును
*శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల శ్రీవారి అర్జిత కళ్యాణోత్సవము సేవా ఉదయము 11.00 గంటల నుండి ప్రారంభమగును*
రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..
మ 1.00 నుండి 2.00 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..
తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును..
మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ..
తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును..
_*మంగళవారము సందర్భముగా సాయంత్రము 7.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వార్లకు వెండిరథ ప్రాకరోత్సవము ను (ఆలయ ప్రాకరోత్సవము) కార్యక్రమమును నిర్వహించడను*_
రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు*
13.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) *_ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు*_ బుకింగ్:28
13.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) *_అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్_* :
13.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) *_అర్జిత కళ్యాణోత్సవము సేవా టిక్కెట్లు
11. శుభమస్తు
*తేది : 13, ఆగష్టు 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : భౌమవాసరే (మంగళవారం)
పక్షం : శుక్లపక్షం : త్రయోదశి
(నిన్న ఉదయం 12 గం॥ 7 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 46 ని॥ వరకు త్రయోదశి తిధి తదుపరి చతుర్దశి తిధి)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 51 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 19 ని॥ వరకు ఉత్తారాషాఢ నక్షత్రం తదుపరి శ్రవణం నక్షత్రం)
యోగము : (ప్రీతి ఈరోజు ఉదయం 10 గం ll 38 ని ll వరకు తదుపరి ఆయుష్మాన్ రేపు ఉదయం 11 గం ll 13 ని ll వరకు)
కరణం : (తైతుల ఈరోజు మద్యాహ్నం 1 గం ll 46 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 21 ని ll )
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 46 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 10 గం॥ 15 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 1 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 51 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 2 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 43 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 59 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 44 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : ధనుస్సు
11. నేటి జాతీయం
*కాలమే సమాధానము చెప్తుంది*అసలు విషయం నిదానంగా తెలుస్తుందని అర్థం. ఏదేని సమస్యకు అప్పటికప్పుడు సమాదానము దొరక్కపోతే…. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.
12. నేటి ఆణిముత్యం
విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత బండితుండు కాడు
కొలని హంసలకడ గొక్కెరయున్నట్టు
విశ్వదాభిరామ వినురవేమ
*తాత్పర్యం:*
హంసల మధ్యలోనే తిరుగాడినా కొంగ ఎప్పటికీ కొంగే. అలాగే చదువుకున్న వాళ్ళ మధ్య తిరుగుతూ కాలం గడిపినంత మాత్రాన విద్యావంతుడనిపించుకోరు.హంస అనే పక్షిని పురాణాల్లో వర్ణిస్తారు. పూర్వకాలం ఆ జాతి పక్షులుండేవని నమ్మకం. హంసలకుండే లక్షణాలు- స్వచ్చమైన తెల్లదనం, సుందరమైన రూపం, దేవతల పక్షి అనే పేరు, భూమ్మీదనే కాకుండా దేవలోకంలో కూడా విహరిస్తుంటాయని నమ్మకం, స్వచ్ఛతకు మారుపేరైన హంసకి పాలల్లో నీళ్ళు కలిపి ఇచ్చినా అందులోంచి హంస పాలని తాగి నీళ్ళని వదిలిపెట్టగలిగే విశేష సామర్థ్యం. కొంగలు కూడా తెల్లగా ఉన్నా, కొలనుల్లోనే విహరించినా, అది ఎప్పటికీ హంస లక్షణాలను సంతరించుకోలేదు. అలాగని హంసలతో తిరుగుతూ ఉంటే వాటి లక్షణం ఏమైనా అంటుకుంటుందా అంటే అద ఎలా సంభవం.
13. మన ఇతిహాసాలు
*మహాభారత యుద్దంలో వ్యూహాలు*
క్రౌ౦చారుణ వ్యూహం
ద్రుష్ట ద్యుమ్నుదు క్రౌంచ పక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు
మకర వ్యూహం
ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మిస్తాడు
*గరుడు వ్యూహం*
మూడవ రోజున ఈ వ్యూహాన్ని భీష్ముడు నిర్మించాడు దీనినే సువర్ణా వ్యూహం అంటారు
*శకట వ్యూహం*
పదకొండవ రోజున ఈ వ్యూహం ద్రోణా చార్యుడు నిర్మించారు బండి ఆకారంలో సైన్యం నిలిపి కేంద్ర స్థానంలో ద్రోణా చార్యుడు ఉంటాడు
*చక్ర వ్యూహం*
పద మూడవ రోజున ఈ వ్యూహం నిర్మించారు దీనినే పద్మా వ్యూహం అంటారు .ద్రోణా చార్యుడు ఈ వ్యూహంలో అభిమన్యున్ని బలి తీసుకున్నాడు .
*భార్హ స్పత్య వ్యూహం*
పది హేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహం పన్నాడు .
*శృంగాటక వ్యూహం*
ఎనిమిదవ రోజున నిర్మించిన ఈ వ్యూహంలోత్రికోనాకారంలో సైన్యం నిలుపుతారు ద్రుష్ట్యద్యుమ్నుడుభీష్ముని వ్యూహానికి ప్రతిగా నిర్మిస్తాడు
*శ్యేన వ్యూహం*
ఈ వ్యూహం ఐదవ రోజు నిర్మిస్తాడు . దీనినే డేగ వ్యూహం అని కూడా అంటారు . భీష్ముడి మకర వ్యూహం నికి ప్రతిగా ద్రుష్ట్య ద్యుమ్నుడు నిర్మించాడు .
*అర్ద చంద్ర వ్యూహం*
మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహంనికి ప్రతిగా దృష్ట్య ద్యుమ్నుడుఈ వ్యూహం నిలుపుతాడు
*మండల వ్యూహం*
ఏడవ రోజున నిర్మించినఈ వ్యూహంలో భీష్మా చార్యుడు కురుసేనను మండలకారంలో నిలుపుతాడు
*మండలార్డ వ్యూహం*
ద్రోణుడు పన్నెడో రోజు కురు సేనను గరుడ వ్యూహంలో నిలుపగా ధర్మ రాజు పాండవ సైన్యం తో ఈ వ్యూహం రచిస్తాడు
*వజ్ర వ్యూహం*
ఏడవ రోజున భీష్ముడు కురుసేనను మండల వ్యూహం తో నిలువరించగ ధర్మ రాజు పాండవ సేనలను వజ్ర వ్యూహం తో నడిపిస్తాడు
*సూచి ముఖ వ్యూహం*
ఆరవ రోజున దృష్ట్యా ద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహం తో నిలుపగా దానికి ప్రతిగా భీష్ముడు క్రౌంచ వ్యూహం తో సైన్యాన్ని నడిపిస్తాడు . రెండు వ్యూహాలు భంగ పడడంతో అభి మన్యుడు సూచి ముఖ వ్యూహం పన్నుతాడు
*వ్యాల వ్యూహం*
నాలుగవ రోజు భీష్ముడు కురు సేనను ముడి వేసు కున్న పాముల నిలుపుతాడు ఈ వ్యూహం ద్వారా సకల సైన్యాల కదలికలను అంచనా వేయటం కష్టము .
*సర్వ తో భద్ర వ్యూహం*
తొమ్మిదో రోజు కురు సేనతో ఈ వ్యూహం భీష్ముడు రచిస్తాడు . మహా వ్యూహం ; రెండవ రోజు భీష్ముడు ఈ వ్యూహం అనేక విధాలుగా నిర్మించి అందరిని హడల కొట్టాడు ఎనిమిదవ రోజు కూడా ఈ వ్యూహం భీష్ముడు నిర్మించాడుమ్మిదో రోజు కూడా భీష్ముడు నిర్మించిన సర్వత్ భద్ర వ్యుహనికి ప్రతిగా ద్రుష్ట్య ద్యుమ్నుడు *మహా వ్యూహం* నిర్మిస్తాడు
14.ముత్యాలలో నీటమునిగిన ముక్తేశ్వర స్వామి ఆలయం
జగ్గయ్యపేట మండలంలో కృష్ణా నది ఉధృతి భారీగా పెరిగింది. దీంతో ముత్యాల, రావిరాల, వేదాద్రి గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలలోని ముక్తేశ్వర స్వామి ఆలయం నీటమునిగింది. వరద నీటితో పాలేరు నది పోటెత్తింది. రావిరాల గ్రామంలోకి వరద నీరు ప్రవేశించే అవకాశం ఉంది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.