DailyDose

భారత్‌లో పాపులర్‌ బ్రాండ్‌లు ఇవే-వాణిజ్య-08/24

Here are the famous brands in India-Telugu business news today-08/24

*ఇప్పటికీ అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజ కంపెనీలే భారతీయుల విశ్వాసాన్ని చూరగొంటున్నవి. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్‌ సర్చ్‌ ఇంజన్‌ ‘గూగుల్‌’ భారత్‌లో ఎక్కువ పాపులర్‌ అయిన బ్రాండ్‌. ఆ తర్వాత స్థానాల్లో వాట్సాప్, యూట్యూబ్‌లు కొనసాగుతున్నట్లు లండన్‌లోని మార్కెట్‌ పరిశోధన, డేటా విశ్లేషణ సంస్థ ‘యూగౌ’ తెలిపింది. ‘బ్రాండ్‌ హెల్త్‌ ర్యాంకింగ్స్‌’ పేరిట పది సంస్థలకు ఇది రేటింగ్‌ ఇచ్చింది. వాటిలో స్విగ్గీకి ఐదవ ర్యాంక్, మేక్‌మైట్రిప్‌కు ఆరవ ర్యాంక్‌ లభించాయి.
* దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండోసారి వడ్డీరేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లను తగ్గించడం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి. ఈ నెల ఒకటవ తేదీన మొదట.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ.. తాజాగా, మళ్లీ వడ్డీ రేట్లను సవరించింది. ఇవి ఈ నెల 26 వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా సవరించిన వడ్డీ రేట్ల విషయానికి వస్తే రిటైల్‌ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్లు, బల్క్‌ డిపాజిట్లపై 30 నుంచి 70 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది ఎస్‌బీఐ. ఇక, 7 నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5 శాతం నుంచి 4.5 శాతానికి, 46 నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.75 శాతం నుంచి 5.5 శాతానికి, 180 నుంచి సంవత్సరం కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటును 6.25శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ కాలావధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.5 శాతం వరకు వడ్డీ రేట్లను తగ్గించింది.
*సిమెంటు, భవన నిర్మాణ సామగ్రి ఉత్పత్తి చేసే ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రీ-ఇంజనీర్డ్ భవన నిర్మాణ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది.
*విశాఖ ఉక్కు కర్మాగారం ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలో ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ (రైలు చక్రాల తయారీ కేంద్రం) ప్రారంభిస్తున్నట్లు ఉక్కు కర్మాగారం సీఎండీ పి.కె.రథ్ తెలిపారు.
*బ్యాంకులను మోసగించిన కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు డెక్కన్ క్రానికల్(డీసీ) హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థ కార్యాలయాలు, ఇళ్లలో నిర్వహించిన సోదాల సందర్భంగా రెండు ఖరీదైన కార్లు, పత్రాలు, హార్డ్డిస్కులు, రూ.5 లక్షల పాతనోట్లు స్వాధీనం చేసుకున్నారు.
*విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలపై జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేపట్టారు.
*ఫ్యూచర్ రిటైల్ ప్రమోటర్ సంస్థ అయిన ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాను ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది.
*వ్యాపారాధిపతులతో పాటు వ్యాపార సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించే ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈఓ), ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్ఓ), ప్రధాన మార్కెటింగ్ అధికారులు (సీఎంఓ).. వంటి వారికి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)పై శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) చేతులు కలిపాయి.
*‘చైనాలో రసాయనాల తయారీ కర్మాగారాల్లో వరుసబెట్టి ప్రమాదాలు జరగటం, అక్కడ పర్యావరణ సమస్యల వల్ల ఔషధ పరిశ్రమకు అవసరమైన ముడిపదార్థాలు, ఇంటర్మీడియేట్లు సరఫరా కావటం లేదు, ఈ సమస్యను ఎదుర్కొనటానికి ఫార్మాసూటికల్ కంపెనీలు సన్నద్ధం కావలసి ఉంది’’ అని దివీస్ లేబొరేటరీస్ ఛైర్మన్ అండ్ ఎండీ మురళీ కే.దివి పేర్కొన్నారు.