Fashion

మహిళల జుట్టు సంరక్షణకు ఉల్లిరసం

Onion Juice For Healthy Strong Long Hair

జట్టురాలే సమస్య చాలామందిని ఇబ్బందిపెడుతుంది. దానికి పరిష్కారం ఏదో షాంపూ వాడటం కాదు. ఇంట్లో లభించే పదార్థాలతోనే ఇలా చేసి చూడండి.
* రెండు కప్పుల నీటిని వేడిచేసి అందులో మూడు గ్రీన్‌టీ బ్యాగులను వేయాలి. తల స్నానం చేశాక ఈ నీటిని జుట్టుకు పట్టించి మర్దన చేయాలి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
* రెండు గుడ్ల తెల్లసొనలో రెండు చెంచాల చెక్కర కలిపి నురగ వచ్చే వరకు గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల వరకు పట్టించి మర్దన చేయాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది. ఈ మిశ్రమాన్ని చర్మ సంరక్షణకూ వాడొచ్చు.
* ఒక గుడ్డు తెల్లసొనలో ఒక్కో చెంచా చొప్పున ఆలివ్‌ నూనె, తేనె కలపాలి. దీన్ని తలకు పట్టించి 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. దీంట్లో ఉండే సల్ఫర్‌, ఫాస్పరస్‌, ఇతర ప్రొటీన్లు జట్టు రాలడాన్ని నిరోధిస్తాయి.
* కొబ్బరి పాలల్లో ఉండే నియాసిన్‌, ఫోలేట్లు, విటమిన్‌ బి3 రక్తప్రసరణ పెరగడానికి తోడ్పడతాయి. ఇవి జుట్టుకు ప్రాణవాయువు అందేలా చేస్తూ రాలే సమస్యను అదుపులో ఉంచుతాయి.
* ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టిస్తే ఈ సమస్య అదుపులోకి వస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్‌ జుట్టు రాలిపోకుండా చేస్తుంది. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు తల్లో ఉండే క్రిములను నశింపజేస్తాయి. రక్తప్రసరణ పెరగడంతో తల్లో పేరుకొనే మురికి చాలామాటుకూ తగ్గుతుంది. సమస్య ఎక్కువగా ఉన్నవారు వారంలో రెండుసార్లు ఈ రసాన్ని వాడొచ్చు.