Movies

చెప్పగలరా?

RGV Poll is Here

సినిమా హిట్టా, ఫ‌ట్టా అనే విష‌యం ప‌ట్టించుకోకుండా కేవలం కాంట్ర‌వ‌ర్సీల‌కి సంబంధించిన స‌బ్జెక్ట్‌ల‌ని తీసుకొని సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు వ‌ర్మ‌. రీసెంట్‌గా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకున్న వ‌ర్మ ఈ చిత్రంలో ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుని కాస్త నెగెటివ్ కోణంలో ఆవిష్క‌రించారు. ఇక ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసి…..‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఈ కొత్త నటుడు ఏ నిజ జీవిత పాత్ర చేస్తున్నాడో చెప్పగలరా?’ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు కొద్దిసేప‌టి క్రితం ఫ‌స్ట్ లుక్ లోగో పోస్ట‌ర్‌కి సంబంధించి మోష‌న్ వీడియో రిలీజ్ చేశాడు వ‌ర్మ‌. టైగర్‌, ప్రొడక్షన్‌ కంపెనీ, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అతిత్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌తో ప‌లు సంచ‌ల‌నాలు సృష్టించిన వ‌ర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంతో ఏ చేస్తాడో చూడాలి.