DailyDose

చింతమనేని ఎఫెక్ట్…సస్పెన్షన్-నేరవార్తలు–09/07

SI Suspended Over Chinthamaneni Issue-Crime News Telugu-09/07

* చింతమనేని కేసులకు సంబంధించి ఎస్సై క్రాంతిప్రియ సస్పెండ్ అయ్యారు. పోలవరం కడికాల్వ గట్టు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న కేసు నుంచి చింతమనేని పేరును క్రాంతి ప్రియ తప్పించారు. ఆ కేసులో అప్పటి పెదవేగి ఎస్సైగా పని చేసిన క్రాంతిప్రియ సక్రమంగా విచారణ చేయలేదని అధికారులు గుర్తించారు.ఇంకా చింతమనేని అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. వీలైనంత త్వరలో పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ పరిణామాల వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తీరుపై పోరాటానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
* అక్రమ సంబంధం పెట్టుకుని గర్భిణి అయిన ఓ మహిళ అర్థరాత్రి కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది
ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న బాత్రూమ్ లోకి బహిర్భూమి కోసం వెళ్లిన గర్భవతిఆ సమయంలో బాత్రూములోనే చిన్నారి జననంగుట్టుచప్పుడు కాకుండా బాత్ రూమ్ లొనే చిన్నారిని వదిలి వెళ్లిన కర్కశ తల్లి విషయం బయటికి పొక్కడంతోపరారీలో ఉన్న అక్రమ సంబంధం నెరిపిన యవకుడు, యువతిబాత్ రూమ్ లొనే శ్వాస విడిచిన శిశువు.
* ముంబైలో అత్యంత ప్రసిద్ధ పొందిన సబర్బన్ విలేపార్లే వినాయకుడ్ని ప్రధాని మోదీ శనివారం దర్శించుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడి మంటపానికే చేరుకున్నారు. వినాయకుడి దర్శనానికి వచ్చిన ప్రధానికి లోకమాన్య సేవాసంఘ్ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మోదీ వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి విజిటర్స్ బుక్ లో మోదీ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ…‘‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని అన్న తిలక్ నినాదాన్ని మీ జీవిత మంత్రంగా చేసుకున్నందుకు మీరు అభినందనీయులు. అందుకు మీరు అర్హులు కూడా. స్వరాజ్యం నా జన్మహక్కు. ప్రస్తుత భారత దేశంలో ‘సురాజ్య’ మంత్రం కర్తవ్యం లాంటిది. ప్రతీ ఒక్కరి హృదయం లోంచి వచ్చే ఈ మంత్రం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తినివ్వాలి. అదే నా ఆశయం’’ అని ప్రధాని మోదీ తన భావాలను ‘విజిటర్స్ బుక్’ లో రాశారు.లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ప్రోత్సాహంతో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో 1923 లో ‘లోకమాన్య సేవా సంఘ్’ అన్న సంఘాన్ని స్థాపించారు. ఇక్కడే గణేశ్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుతారు.
* ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు భారీమొత్తంలో పెరిగాయి. ఈ చట్టం అమలులోకి రావడంతో ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేసిన పలువురు వాహనదారులకు ఒక్కరోజే ఏకంగా రూ. 59వేల వరకు జరిమానాలు విధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షం శివసేన ట్రాఫిక్‌ జరిమానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధించడంలోని ఆంతర్యమేమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఈస్థాయిలో జరిమానాలు విధిస్తే.. సామాన్య ప్రజలు ఎలా భరిస్తారని ప్రశ్నించింది.
* తాడికొండ మండలం బండారుపల్లి గ్రామంలో నాటు బాంబుల కలకలం. టీడీపీ నేత బండారు హరిబాబుకు చెందిన పాత ఇంట్లో పేలిన బాంబులు. ఎన్నికల సమయం లొనే తెచ్చి పెట్టినట్లు చెపుతున్న గ్రామస్తులు. మరి కొన్ని ప్రాంతాల్లో కూడా వున్నట్లు అనుమానం. గతంలో ఇది ఫ్యాక్షన్ గ్రామం. గతం లోను ఈ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు ఫ్యాక్షన్ ముద్ర. తుళ్లూరు మండల పరిధిలో పెదపరిమి గ్రామము లోను గతంలో భారీగా నాటు బాంబుల దాడులు. భయాందోళన లో నియోజకవర్గాల ప్రజలు.
* నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం అంక్సాపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుమారుడికి విషం తాగించిన తల్లి తాను కూడా అదే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి గంగామణి మృతి చెందగా, ఏడేళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు కుమారుడిని ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికుల సమాచారం.
* గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని కేర్ స్కూల్ (ప్రైవేట్ విద్యా సంస్థలో ) విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థి (చిన్నారి ) పాఠశాల నుండి బస్సులో ఇంటికి తిరిగి వెళ్ళుతుండగా పిట్టలవానిపాలెం మండలం కేంద్రంలోని హైలాండ్ సెంటర్ సమీపంలో స్కూల్ బస్ కిటికీ లోపల నుంచి ప్రమాదవశాత్తు జారి రహదారిపై పడిపోవడంతో చిన్నారి నుదిటిపై పగిలి, దంతాలు పెదాలపై గుచ్చు కొని గాయాలై రక్తస్రావం ఎక్కువగా కావడంతో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలుడికి చికిత్సలు నిర్వహిస్తున్నారు
* ప్రకాశం జిల్లా సీఎస్ పురం ఎంపీడీవో కార్యాలయంలో పెన్షన్ పంపిణి కోసం ఆఫీసులో ఉంచిన 27వేలు నగదు మాయం పంచాయతీ కార్యదర్శి తనిఖీతో అలస్యంగా వెలుగు చూసిన ఘటన.
* గుంటూరు జిల్లా కారంపూడి మండలంలో రాత్రిపూట బిల్లులు లేకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న 2 లారీలను అదుపులోకి తీసుకొని మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి తగిన చర్య నిమిత్తం అప్పగించారు.
* జమ్ముకశ్మీర్ లోని సోపోర్ జిల్లా దంగెర్ పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో చిన్నారి సహా నలుగురు పౌరులకు గాయాలయ్యాయి.
* సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్టానిక ఏరియా ఆసుపత్రి లో, పట్టణానికి చెందిన జాహెద అనే బాలింత మహిళ కాన్పు కోసం గత నాలుగు రోజుల క్రితం ఆసుపత్రి కి రాగా వైద్యులు ఇంకా డెలివరీ కి ఇంకా టైమ్ వుందని మరో పది రోజుల తర్వాత రమ్మని చెప్పగా ఈ రోజు ఉదయం పురిటి నొప్పులు రావడం తో కుటుంబ సబ్యులతో ఆసుపత్రి కి వచ్చారు.
*అభం,శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై పదహారు సంవత్సరాల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పెందుర్తి సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
*తండ్రికి ఓ కుమార్తె అంత్యక్రియలు నిర్వహించి తోటి ఆడపిల్లలందరికీ ఆదర్శంగా నిలిచారు. సమాజంలో ఆడ, మగ అనే భేదం లేదని నిరూపించారు. వివరాల్లోకెళ్తే… మండలంలోని అలవలపాడు గ్రామ మాజీ సర్పంచ్ తాటిపర్తి వెంకట సుబ్బారెడ్డి(72) గుండెపోటుతో గురువారం రాత్రి మరణించాడు. ఆయనకు పెద్ద కుమార్తె భానుమతి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.
*ఓ రైతు బస్సులో విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. తొండూరు మండలం పాలూరుకు చెందిన కంచర్ల శివలక్ష్మిరెడ్డి(44)కు ఐదెకరాల పొలం ఉంది. వేరుశనగ, పత్తి ఇతర పంటలు సాగు చేసి నష్టపోయాడు. రూ.20 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన శుక్రవారం వేంపల్లెకు వెళ్లాడు. అక్కడ పులివెందుల బస్సెక్కి విషపు గుళికలు తిని, ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే బంధువులు చేరుకుని శివలక్ష్మిరెడ్డిని కడప రిమ్స్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
*నకిలీ నోట్లు ముద్రించి, చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కథనం మేరకు.. ఏలూరుకు చెందిన పబ్బాటి మురళీకృష్ణకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. గతంలోనూ దొంగనోట్లు చెలామణి చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్పై వచ్చిన మురళీకృష్ణ.. కర్నూలు జిల్లా పుట్టపాశం గ్రామానికి చెందిన సందెపోగులు రాములు, రాజస్థాన్కు చెందిన ప్రేమదా్స తదితరులతో ముఠాను ఏర్పాటు చేశాడు. ఏలూరులోని జంగారెడ్డిగూడెం రోడ్డులో గది అద్దెకు తీసుకుని నెలన్నర నుంచి దొంగనోట్లు ముద్రిస్తున్నారు.