WorldWonders

పసిడి కమోడ్ పుసుక్కున లేపేశారు

Golden Toilet Worth 8Crores Stolen In London

బంగారు మరుగుదొడ్డిని దోచేశారు!

అచ్చంగా 18 కేరట్ల బంగారంతో చేసిన మరుగుదొడ్డి ఇది.

లండన్‌లోని బ్లనియమ్‌ ప్రాసాదంలోని ప్రదర్శనశాలలో ఉన్న దీనిని శనివారం దొంగలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు

దీని విలువ సుమారు రూ.8.8 కోట్లు ఉండొచ్చని చెప్పారు.

న్యూయార్క్‌లోని సోలోమన్‌ ఆర్‌ గుగెన్‌హైమ్‌ ప్రదర్శనశాల నుంచి రెండు రోజుల క్రితమే దీనిని లండన్‌ తీసుకొచ్చారు.

అక్టోబర్‌-27 వరకు ఈ కళాఖండాన్ని బ్లనియమ్‌ ప్రదర్శనశాలలో ఉంచాలని నిర్వాహకులు భావించారు.

ఇంతలోనే దొంగలు ఎత్తుకుపోవడంతో పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు.