Health

థైరాయిడ్ గ్రంథికి సాయపడే యోగాసనం

This Yoga Aasana Helps Thyroid Gland

సర్వాంగాసనం: శవాసనంలో పడుకొని కాళ్లను తొంభై డిగ్రీల కోణంలో పైకి లేపాలి. మోచేతుల్ని నేలపై ఉంచి… అరచేతులతో నడుముభాగాన్ని పట్టుకోవాలి. చుబుకాన్ని కంఠానికి ఆనించే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనంలో అర నిమిషం నుంచీ నిమిషం వరకూ ఉండొచ్చు. కాళ్లను నిదానంగా కిందకు దింపుతూ యథాస్థానానికి రావాలి. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడటానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, హెర్నియా, మోకాళ్ల నొప్పులు ఉన్న వారు ఈ ఆసనం వేయకూడదు.