Fashion

ఉప్పు కలిపిన నీటితో ఉతికితే వెలిసిపోవు

Wash Clothes In Salt Water To Avoid Color Fading

నచ్చిన డ్రెస్‌ అప్పుడే రంగు వెలిసిపోతే… ఇష్టంగా కొనుక్కున్న చుడీదార్‌ కళావిహీనంగా మారితే… బాధేస్తుంది. మరి దుస్తులు రంగు వెలిసిపోకుండా, కొత్తవాటిలా కనిపించాలంటే ఏం చేయాలో చూద్దామా…
ఉప్పు: దుస్తులు రంగు పోకూడదంటే… ముందుగా వాటిని ఉప్పు కలిపిన నీటిలో కాసేపు ఉంచి ఆ తరువాత ఉతకాలి. ఉప్పు లోని క్లోరైడ్‌ దుస్తుల నుంచి రంగు వదలకుండా చేస్తుంది.
చల్లటినీళ్లు: కొత్త దుస్తులను మొదట చల్లటి నీటిలో వేసి తీయాలి. ఆ తరువాత ఈ నీటిలోనే కొద్దిగా డిటర్జెంట్‌ వేసి వాటిని నానపెట్టాలి. పది నిమిషాలాగి ఉతికేస్తే ఏ ఇబ్బందీ ఉండదు.
వెనిగర్‌: దుస్తులను ముందుగా వెనిగర్‌ వేసిన నీటిలో ముంచి తీయాలి. ఆ తరువాతే డిటర్జెంట్‌ వాడాలి. ఇలా చేస్తే దుస్తులు రంగును కోల్పోవు.
వంటసోడా: ఇది రంగును పోకుండా కాపాడటమే కాదు… అవి మృదువుగా, దుర్వాసన లేకుండానూ ఉంటాయి. దుస్తుల్ని బట్టి వంటసోడాను ఎంచుకుంటే చాలు.
సూచనలు చదవండి: మీ దుస్తులను ఎలా ఉతకాలనేది వాటిపై ఉండే లేబుల్‌ చెబుతుంది. ఏ నీరు వాడాలి… ఎలాంటి డిటర్జెంట్‌ ఉపయోగించాలనేది దానిపై చూసి ఆ విధంగానే చేయాలి. ఆ నిబంధనలను పాటిస్తే రంగు వెలిసిపోకుండా ఉంటాయి.
తిరగేయాలి: దుస్తులను ఉతికే ముందు వాటిని తిరగేసి పిండి చూడండి. అలా చేయడం వల్ల రంగు పోవు. తక్కువ గాఢత ఉండే డిటర్జెంట్లు దుస్తుల నుంచి రంగును వేరు చేయవు.
విడివిడిగా: ముదురు, లేత రంగుల దుస్తులను కలిపి కాకుండా… వేటికవే వేరుచేసి ఉతికినా ఏ సమస్యా ఉండదు. ప్రయత్నించి చూడండి.