Politics

తెదేపా రుణమాఫీ ఉత్తర్వులు రద్దుచేసిన జగన్ సర్కార్

Jagan Govt Cancels Loan PayOut GOs Issued By TDP

గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది మార్చి 10న జారీ చేసిన జీవో 38ని రద్దుచేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 4-5 విడతల్లో ఇవ్వాల్సిన రుణమాఫీ నిధులు రూ.7959.12 కోట్లు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ రెండు విడతల్లో మొత్తం 10శాతం వడ్డీని కలుపుతూ గత ప్రభుత్వం జీవో నంబర్‌ 38ని జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన ఈ రుణమాఫీ జీవోను రద్దుచేస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ జీవోను రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అమలు నేపథ్యంలో ఈ తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.