Kids

పిల్లల మానసిక పరిపక్వతకు వ్యాయామం తప్పనిసరి

Telugu Kids News | Exercise And Games Are Must For Kids

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం స‌రైన స‌మ‌యానికి అన్ని పోష‌కాల‌తో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అలాగే నిత్యం వ్యాయామం కూడా చేయాలి. దీంతో శారీర‌కంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. అయితే కేవ‌లం పెద్ద‌లు మాత్ర‌మే కాదు, పిల్ల‌లు కూడా వ్యాయామం చేస్తే అనేక లాభాలు ఉంటాయ‌ట‌. ముఖ్యంగా వారు చ‌దువుల్లో ఎక్కువ‌గా రాణిస్తార‌ట‌. ఈ విష‌యాన్ని సైంటిస్టులు చేపట్టిన తాజా ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి. యూనివ‌ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన కొంద‌రు సైంటిస్టులు పిల్ల‌ల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు. నిత్యం వ్యాయామం చేసే పిల్ల‌లు, చేయ‌ని పిల్ల‌ల‌కు సంబంధించి.. వారు చ‌దువుల్లో ఎలా రాణిస్తున్నారు.. అనే విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు. దీంతో తేలిందేమిటంటే.. నిత్యం కనీసం 60 నిమిషాల పాటు వ్యాయామం చేసే పిల్ల‌లు చ‌దువుల్లో కూడా బాగా రాణిస్తార‌ని తెలుసుకున్నారు. అందువ‌ల్ల పిల్లల్ని రోజూ క‌నీసం 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేసేలా ప్రోత్స‌హించాల‌ని, లేదా క‌నీసం ఆట‌లు ఆడుకునేందుకు అయినా పెద్ద‌లు అనుమ‌తించాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. దీంతో వారు చ‌దువుల్లో బాగా రాణిస్తార‌ని అంటున్నారు..!