DailyDose

PMC బ్యాంకుపై ఈడీ మనీలాండరింగ్ కేసు-వాణిజ్యం-10/04

Telugu Business News Today | Money Laundering Case Filed On PMC Bank-10/04

* పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ కుంభకోణంలో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) ప్రమోటర్లు, బ్యాంక్‌ మాజీ బోర్డు సభ్యులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ముంబయిలో బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌, హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లకు చెందిన ఆరు వివిధ ప్రాంతాల్లో అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించింది. ప్రస్తుతం 5.40శాతంగా ఉన్న రెపో రేటును పావుశాతం తగ్గించి 5.15శాతంగా నిర్ణయించింది.

* దేశంలో చమురు ధరలు వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో పెట్రోల్‌ ధర లీటరుకు 18 పైసలు తగ్గగా, చెన్నైలో 19 పైసలు తగ్గింది. ఇక డీజిల్‌ విషయానికి వస్తే దిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో లీటరుకు 8 పైసలు తగ్గగా, చెన్నైలో 9 పైసలు తగ్గింది.