Politics

నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే అరెస్ట్

Nellore Rural YSRCP MLA Kotamreddy Arrested

నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్టు అయ్యారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని ఎంపీడీవో సరళ ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సరళ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కోటంరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోటంరెడ్డి అరెస్టుకు ముందు ఎమ్మెల్యే ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ఆయన కోసం పోలీసులు కాపుకాసారు.