NRI-NRT

తెలంగాణ జాగృతి ఖతర్ జానపద బతుకమ్మ

TNILIVE Qatar Telugu News | Telangana Jagruti Qatar Celebrates Folk Batukamma 2019

తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో తెలంగాణ జానపదాల ఔన్నత్యాన్ని తెలుపుతూ జానపద బతుకమ్మ నిర్వహించడం జరిగింది.ప్రముఖ జానపద కళాకారులు తేలు విజయ గారు మరియు అష్ట గంగాధర్ గార్లు అతిధులుగా హజరై పాత కొత్త జానపదాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు శ్రీ AP మణికంఠణ్, ICBF అధ్యక్షుడు బాబు రాజన్ మరియు ఎంబసీ అధికారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఖతర్ లో ప్రముఖ విద్యావేత్త, శ్రీ కె యస్ ప్రసాద్ గారితో పాటు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురికి మెమెంటోతో సత్కరించారు.

తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షులు శ్రీమతి నందిని అబ్బగౌని గారు మాట్లడుతూ గత సంవత్సరం చేనేత కు చేయుతనిస్తూ చేనేత బతుకమ్మ చేసామని‌, ఈ యేడు మన జానపద ఔన్నత్యాన్ని, కళలను వాటి గొప్పతనాన్ని ప్రపంచానికీ చాటి చెప్పాలనే ఉద్దేశ్యం తో చేసిన జానపద బతుకమ్మ కు విశేష స్పందన వచ్చిందని దాదాపు 450 మందికి పైగా ప్రవాసులు హజరై లయబద్దంగా, సాంప్రదాయ పరంగా , డీజే చప్పుల్లతో కాకుండా అసలైన బతుకమ్మ పాటలతో, జానపదాలతో బతుకమ్మ ఆడారని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న గారు మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా కార్మికులకు, ఉద్యోగులకు నైపుణ్య అభివృద్ధి శిబిరాలు, మహిళలకు సాంప్రదాయ వంటల పోటీలు, మహిళా సాధికారత సెమినార్లు వంటి సామాజిక కార్యక్రమాలే కాకుండా గల్ఫ్ కార్మికులకు అండ దండగా అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టు వివరించారు.