WorldWonders

ఎకరం ₹35కోట్లు

Raymonds Sells 20Acres For 35Crores Each

ముంబైలోని థానేలో ఉన్న 20 ఎక‌రాల స్థ‌లాన్ని రేమండ్ వ‌స్త్ర కంపెనీ అమ్మేసింది. వ‌ర్చువ‌స్ రిటేల్ సౌత్ ఆసియా కంపెనీకి సుమారు 700 కోట్ల‌కు ఆ స్థ‌లాన్ని అమ్మేశారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు రేమండ్ సంస్థ ఈ విష‌యాన్ని తెలిపింది. త‌మ కంపెనీకి చెందిన అసోసియేట్ ఫిర్మ్ జేకే ఇన్వెస్టో ట్రేడ్.. థానే భూమిని ఎలిప్స్ వెంచ‌ర్‌కు ఇస్తున్న‌ట్లు రేమండ్ పేర్కొన్న‌ది. గ్జాండ‌ర్ గ్రూపున‌కు చెందిన‌దే వ‌ర్చువ‌స్ రిటేల్ సౌత్ ఆసియా కంపెనీ. ఈ భూమి అమ్మ‌కంతో థానేలో క‌మ‌ర్షియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రుగుతుంద‌ని రేమండ్ కంపెనీ పేర్కొన్న‌ది. రేమండ్ సంస్థ‌కు థానేలో 125 ఎక‌రాల స్థ‌లం ఉన్న‌ది. దాన్ని మానిటైజ్ చేయాల‌ని ఆ సంస్థ ఆలోచిస్తున్న‌ది. అక్క‌డ ఓ హౌజింగ్ ప్రాజెక్టును ఆ కంపెనీ మొద‌లుపెట్ట‌నున్న‌ది. సుమారు 3వేల ఇండ్ల‌ను రేమండ్ రియాల్టీ నిర్మించేందుకు ప్లాన్ వేసింది. దానిలో భాగంగానే భూమి అమ్మ‌కం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.