Business

అప్పటిదాకా ఆగమంటున్న భారతీయ రైల్వే

Indian Railways To Be Pollution Free By 2030

పర్యావరణ మార్పులను అడ్డుకునేందుకు భారత్‌చేస్తున్న కృషి 2030 నాటికి వేగవంతం కావచ్చు. భారత రైల్వేలు 2030 నాటికి నికరంగా కర్బన ఉద్గారరహితంగా మారుతుందని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ దశకు రావడానికి చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందన్నారు. నాటికల్లా రైల్వేలు పూర్తిగా విద్యుత్తు ఆధారంగానే పనిచేస్తాయని పేర్కొన్నారు. కాలుష్యం తగ్గించాలనే ప్రధాని మోదీ ఆశయంలో రైల్వేలు ప్రధాన భాగమని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. ఇండియన్‌ ఎనర్జీ ఫోరంలో నేడు వారు మట్లాడారు. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత అత్యధికంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను భారత్‌ నుంచే వస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. భారత్‌లో సుమారు 1,25,000 కిలోమీటర్ల మేరకు రైలు మార్గాలు విస్తరించి ఉన్నాయి. ఈ క్రమంలో రైల్వేల భారీగా భూములు కూడా ఉన్నాయి. ఇవి సౌరశక్తి ఉత్పత్తికి అత్యంత అనుకూలమైనవి. రైల్వేలకు 2018-30 మధ్య రూ.50లక్షల కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని అంచనా. ఈ పెట్టుబడుల తర్వాత రవాణ ధరలు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం భారత్‌ రవాణ ఖర్చు అత్యధికంగా 16-18శాతం వరకు ఉన్నాయి. అదే చైనాలో 8-10శాతం మధ్యలో ఉన్నాయి. భారతీయ రైల్వేల్లో 1.4 మిలియన్ల మంది ఉద్యోగులు ఉండగా, 20,849 రైళ్లు ఉన్నాయి. నిత్యం 2.3కోట్ల మంది వీటిల్లో ప్రయాణిస్తుంటారు.