Fashion

అలోవెరా సహజసిద్ధంగా ఉండగా రసాయనాలు ఎందుకు దండగ!

Telugu Fashion Tips - Cleanse With Aloe Vera Instead Of Chemicals

రసాయనాలు మేళవించిన ఉత్పత్తులు ఎన్ని ఉన్నా… సహజంగా దొరికే పదార్థాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. అలాంటి పదార్థాలను మనం ఎలా ఉపయోగించొచ్చో చూద్దామా…
* డియోడరంట్లు వాడుతున్నారా… వాటికి బదులు మీ శరీరాన్ని తాజాగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. స్నానం చేసే నీటిలో కొద్దిగా సముద్రపు ఉప్పుతోపాటు ఆలివ్‌, బాదం లేదా కొబ్బరి నూనె… ఇలా ఏదో ఒకటి కొన్ని చుక్కలు వేసుకోవాలి. ఈ నీటితో స్నానం చేస్తే సాయంత్రం వరకు శరీరం పరిమళభరితంగా, తాజాగా ఉంటుంది.
* షాంపూలకు బదులు… అప్పుడప్పుడూ కుంకుడుకాయలు, షీకాయ వాడి చూడండి. జుట్టు పట్టులా మారుతుంది. రాలే సమస్య ఉన్నా… చాలామటుకూ తగ్గుతుంది.
* కలబంద చాలు… ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు చాలామంది క్లెన్సర్లు వాడుతుంటారు. దానికి బదులుగా తాజాగా కలబంద గుజ్జును ముఖానికి రాసి…నెమ్మదిగా మర్దన చేయండి. పావుగంటయ్యాక కడిగేస్తే… మృతకణాలు పోవడమే కాదు చర్మం శుభ్రపడుతుంది. ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది.
* సహజ పూత వేద్దామా… ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత… ఏదో ఒక పూత వేసుకోవాలి. పావుకప్పు బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలిపి ముఖానికి రాసుకోండి. ఆరాక కడిగేస్తే చాలు. ముఖం తాజాగా కనిపించడమే కాదు, మొటిమల సమస్యా అదుపులోకి వస్తుంది.