Movies

తైవాన్ పోరాట యోధురాలు

Kajal Aggarwal As Fighter In Indian2. Shoots In Taiwan.

కాజల్‌ అగర్వాల్‌ వయసు తెలుసుకోవడంలో కష్టమేముంది?.. వికీపీడియా చూస్తే సరిపోతుంది! అనే కదా అనుకుంటున్నారు. కానీ అమ్మడు చెబుతున్నది ఆమె అసలు వయసు కాదు. కమల్‌హాసన్‌ సరసన నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ చిత్రంలోని ఆమె పాత్ర వయసు గురించి. వివరాల్లోకి వెళితే.. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా ‘ఇండియన్‌ 2’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కూడా ‘సేనాపతి’ అనే పాత్ర కొనసాగనుంది. మళ్లీ వృద్ధుడిగా కమల్‌ నటిస్తున్నారు. ‘90 ఏళ్ల వృద్ధుడి పాత్ర కోసం వైవిధ్యమైన పోరాట సన్నివేశాన్ని కంపోజ్‌ చేస్తున్న’ట్లు ఇటీవల స్టంట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ కూడా చెప్పారు. దీంతో కాజల్‌ పాత్ర ఎలా ఉంటుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి కాజల్‌ స్పందిస్తూ.. ‘‘ ఈ చిత్రంలో స్వీయ రక్షణ కళలు తెలిసిన అమ్మాయిగా నటిస్తున్నా. కానీ ఆ పాత్ర వయసు గురించి చెప్పను. వచ్చే నెలలో తైవాన్‌లో చిత్రీకరణ జరుగనుంది. అందులో నేను కూడా పాల్గొంటానని’’ పేర్కొన్నారు.