Movies

రవితో శృతి

రవితో శృతి-Shruti Hassan Pairs Up With Raviteja Again

‘కాటమరాయుడు’ తరవాత మళ్లీ తెలుగు తెరపై శ్రుతిహాసన్ కనిపించలేదు. యువ కథానాయికల జోరు ఎక్కువవుతున్న ఈ తరుణంలో శ్రుతిహాసన్ నిలదొక్కుకోవడం కష్టమే అనిపించింది. ఎట్టకేలకు తనకో మంచి అవకాశం దక్కింది. రవితేజ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. బి.మధు నిర్మాత. శ్రుతిహాసన్ని కథానాయికగా ఎంచుకున్నారు. రవితేజ, గోపీచంద్ కలయికలో వచ్చిన ‘బలుపు’లోనూ శ్రుతినే నాయిక. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ‘‘రవితేజతో గోపీచంద్ మలినేని తీస్తున్న మూడో చిత్రమిది. ఇది వరకు వచ్చిన ‘డాన్శీను’, ‘బలుపు’ మంచి విజయాల్ని అందుకున్నాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. నవంబరులో ఈ చిత్రం మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’న్నారు నిర్మాత.