DailyDose

పెరిగిన పెట్రోల్ ధర-వాణిజ్యం-11/14

Fuel Prices Hiked In India-Telugu Business News-11/14

* పెట్రోలు ధరలు పెరిగాయి. వివిధ మెట్రో నగరాల్లో గురువారం పెట్రోల్‌ ధర లీటరుకు 16 పైసల చొప్పున ఎగిసింది. అయితే డీజిల్‌ ధరలు యథాతథంగా ఉన్నాయి. బ్రెంట్‌ ఫూచర్స్‌ 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.53 డాలర్లుగా ఉంది. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 15 పైసలు క్షీణించి 72.24 ను తాకింది.
* రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల ధరలను పెంచింది. ఆగస్టులో ప్రవేశపెట్టిన ‘బుల్లెట్‌ 350’ కొత్త మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బుల్లెట్‌ 350(కిక్‌ స్టార్ట్‌) ధరను రూ.2,755, బుల్లెట్‌ 350 (ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌) ధర రూ.4,365 మేరకు పెంచింది. ధర పెరుగుదలకు ముందు కిక్‌స్టార్‌ మోడల్‌ ధర రూ.1,12,000, ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ ధర రూ.1,26,000గా ఉంది.
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 మోడల్‌లో సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌, 280 ఎంఎం ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌, 346 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు.
*హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ఈకిన్కేర్.. సిరీస్ ఏ కింద 36 లక్షల డాలర్ల (దాదాపు రూ.25 కోట్లు) నిధులను సమీకరించింది.
*డేటా, లిస్టింగ్స్ సేవలందిస్తున్న ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజీ (ఐసీఈ) హైదరాబాద్లో కేంద్రాన్ని ప్రారంభించింది. దీని ద్వారా భారత్లో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఈ కేంద్రం ద్వారా ప్రైసింగ్, అనలిటిక్స్, ఎక్స్ఛేంజీ డేటా సేవలను అందిస్తుంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి కావేరీ సీడ్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.13.52 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.15.52 కోట్లతో పోలిస్తే దాదాపు 13 శాతం తగ్గింది.
*విమానయాన సంస్థ స్పైస్జెట్ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.462.58 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.
*చక్కెర మిల్లుల కోసం ప్రకటించిన రూ.15,000 కోట్ల రాయితీ రుణ పథకం చెల్లింపు గడువుపై విధించిన మారటోరియాన్ని (నిలిపివేత) కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది.
*మెడికల్ ట్రాన్స్ర్కిప్షన్ సేవలందిస్తున్న ఎక్విటీ సొల్యూషన్స్ వచ్చే ఏడాది చివరినాటికి హైదరాబాద్ కేంద్రాల్లో కనీసం 1000 మందిని నియమించుకోవాలని భావిస్తోంది. కంపెనీకి హైదరాబాద్లో కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్లలో కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,000 మంది నిపుణులు పని చేస్తున్నారు.
*సెప్టెంబరు చివరినాటికి హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఇప్పటికీ 23,890 గృహాలు ఇంకా అమ్ముడు పోకుండా మిగిలిపోయాయి. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ అనరాక్ తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
*ధరల రక్కసి మళ్లీ కోరలు చాచింది. సామాన్యుల జేబులు గుల్లచేస్తోంది. గత నెలలో మార్కెట్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠానికి చేరుకుంది.