Politics

మంత్రి కొడాలి నానిపై బ్రాహ్మణుల ఆగ్రహం

Brahmins Express Anger On Minister Kodali Nani

ది.18 11 2019 సోమవారం ఉదయం 11 గంటలకు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఏపీ అర్చక సమాఖ్య బ్రాహ్మణ చైతన్య వేదిక బాలాజీ భక్త బృందం సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ ఏపీ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి బృందావనం రాధాకృష్ణమూర్తిలు మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మాత్యులు కొడాలి నాని తిరుమల నియమావళి అయిన అన్యమత డిక్లరేషన్ పై ముఖ్యమంత్రి సంతకం చేయడు, ముఖ్యమంత్రిగా ఎక్కడికైనా వెళ్లే హక్కుంది, “తిరుమలను ఎవడు అమ్మ మొగుడు కట్టించాడు” అంటూ రాష్ట్ర మంత్రి హోదాలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశ్వాసాలను నియమావళిని దేవాలయ సాంప్రదాయాలను అత్యంత నీచంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవస్థానం కాదని అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయం అని రాష్ట్రమంత్రి కి తెలియకపోవటం విడ్డూరంగా ఉందని, కొడాలి నాని ఈ రాష్ట్రానికి మంత్రిగా మహాఉంటే రెండు సంవత్సరాలు ఉంటాడని, ఈ రెండు సంవత్సరాలకే ఇంత ఇంత మిడిసిపాటా అని ప్రశ్నించారు.., ఒక రాష్ట్రమంత్రి అయివుండి కలియుగదైవం పట్ల అంతా కండకావరం గా అహంకార పూరితంగా మాట్లాడి భక్తుల మనోభావాలను తీశారని ఈ దేశ రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం కన్నా గొప్ప వ్యక్తులు ఏం కాదని, సాక్షాత్తు భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మరియు విదేశీ అధ్యక్ష ప్రధానులు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు స్వామివారి పట్ల తమకు విశ్వాసం ఉందని, అక్కడ ఉన్న డిక్లరేషన్ పుస్తకంలో లో స్వయంగా సంతకాలు చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి వెళ్లే వారిని అటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వామివారి పట్ల, హిందూ మత విశ్వాసాల పట్ల గౌరవం ఉన్నట్లయితే సంతకం చేసే వాడని, అలా సంతకం చేయకుండా స్వామివారి విశ్వాసాల విశ్వసించ కుండా పూజలు చేయించుకోవటం మహా అపచారం అని దాన్ని సమర్థిస్తూ రాష్ట్ర మంత్రి కొడాలి నానితో “దేవస్థానాన్ని ఎవడు అమ్మ మొగుడు కట్టించాడు” అని అనిపించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటానుకోట్ల మంది భక్తుల మనోభావాలను ఒక పథకం ప్రకారం కుట్రతో దెబ్బతీయడమేనని ప్రభుత్వం అవలంబించే ఈ విధానాలకు స్వామి వారి ఆధ్వర్యంలో దుష్టశిక్షణ తప్పక జరిగి తీరుతుందని హెచ్చరించారు. గతంలో తిరుమల సాంప్రదాయాలను కించపరుస్తూ మరియు తిరుమలకు ఏడుకొండలు ఎందుకు రెండు కొండలు చాలు అని జిఓ ఇచ్చిన ప్రభుత్వాధినేత తదితర మంత్రులకు,వివిధ రాజకీయ పార్టీలకు భక్తుల సాక్షిగా తగిన శిక్ష విధించిన సంఘటనలు చూసి కూడా ఈ కొత్త ప్రభుత్వం కూడా స్వామివారిని అవమానిస్తూ గత కొంతకాలం నుండి తమ రాజకీయ వివాదాల్లోకి లాగి కలియుగ దైవాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని, దాని శిక్షా ఫలితం ఈ కలియుగంలోనే తప్పకుండా అనుభవించి తీరుతారని శాపనార్థాలు పెట్టారు. గతంలో తిరుమలలో అన్య మత విషయాలపై మాట్లాడిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నా రని ప్రశ్నించారు? ఎప్పటికైనాసరే హిందూ ధర్మం పట్ల చేస్తున్న తప్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ధర్మ పరిరక్షణ కొరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంధ్యాల వేంకట రామలింగేశ్వర శాస్త్రి ,బృందావనం రాధాకృష్ణ మూర్తి , దండిభోట్ల శ్రీనివాస్ , ఐలూరి శ్రీనివాస శర్మ ,వేదాంతం లక్ష్మణా చార్యులు ,పెద్దింటి ఫణి రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.