DailyDose

ఎమ్మెల్యేపై కత్తితో దాడి-నేరవార్తలు-11/18

MLA Attacked WIth Knife-Telugu Crime News Today-11/18

*కర్ణటక మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైజ్ పై ఓ వ్యక్తీ కత్తితో దాడి చేసి అలజడి రేపాడు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
*కాలిఫోర్నియాలోని ఓ ఇంట్లో పార్టీ చేసుకుంటున్న బృందంపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా అనేకమంది గాయాలపాలయ్యారు. లాస్‌ ఏంజిల్స్‌కు ఉత్తరాన 320 కి.మీ దూరంలో ఉన్న ఫ్రెస్నోలో ఈ ఘటన చోటుచేసుకుంది.
*కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్వీర్‌ సేత్‌పై కత్తి దాడి జరిగింది. కర్ణాటకలోని నరసింహరాజ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తన్వీర్‌ సేత్‌.. మైసూరులో ఆదివారం రాత్రి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో కూర్చున్న ఎమ్మెల్యే వద్దకు 25 ఏళ్ల యువకడు వచ్చి మాట్లాడుతున్నట్లు నటించి ఆయనపై కత్తితో దాడి చేశాడు.
* ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌ మండలం కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నల్లా దేవేందర్‌కు చెందిన కోళ్లఫారంలో 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెళ్ళిన వారం రోజులు కోడా గడవక ముందే తన వైవాహిక జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకలనుకుంది అత్తవాతింటికి వచ్చిన భార్య భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
*కృష్ణాజిల్లా గన్నవరం లో దారుణం. విజయవాడ లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి చిట్టూరి మురళి. తండ్రి మరణించటo వలన కుటుంబ భారం తనమీద పడటం తో పగలు కాలేజ్ కి వెళ్లి చదువుకుంటూ రాత్రి పూట టీ స్టాల్ నడుపుతూ కష్టపడి తన అక్క, చెల్లెలు పెళ్లి చేసిన మురళి. రాత్రి పూట తన తల్లి ని తోడుగా తీసుకుని టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్న విద్యార్థి.
*హైదరాబాద్‌ నగరంలో ల్యాప్‌టాప్‌ల చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కుసుమపాల్‌ రాజ్‌ నుంచి రూ. 4 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లు, చేతి గడియారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*నగదు లావాదేవీల్లో తేడాలొచ్చాయని ఇద్దరు వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయంలో కొట్టుకున్నారు. ఒకరినొకరు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
* అనంతపురం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులు వెంటనే వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
* రోడ్డు పక్కన ఆడుకుంటున్న చిన్నారులపై ఓవర్‌లోడ్‌ చేసిన ట్రాక్టర్‌ట్రాలీ పడడంతో ఆరుగురు మృతిచెందిన ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
*మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
*బీహార్‌ గోపాల్‌గంజ్‌ జిల్లాలోని సరేయా నరేంద్ర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పింది. దీంతో ట్రాక్టర్‌ పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
*జంపన్నవాగులో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ములుగు జిల్లా మేడారం జంపన్నవాగులో నిన్న ఐన ఓరం ప్రశాంత్(పుప్పి రెడ్డి రఘు(లు గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు జంపన్న వాగు దగ్గరకు చేరుకుని.. ప్రశాంత్రఘుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలించారు. దీంతో ప్రశాంత్రఘుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
*అనంతపురం కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమంలో ఓ మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తనకున్న మూడు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరుతో రికార్డుల్లోకి ఎక్కించారంటూ పెద్దవడగూరుకు చెందిన దేవమ్మ అనే మహిళ ఆవేదనకు లోనైంది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
* ఓ ఇంట్లో జరుగుతున్న పార్టీలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో నలుగురు మృతిచెందిన ఘటన కాలిఫోర్నియాలోని ఫ్రేస్నోలో చోటు చేసుకుంది. సౌత్‌వెస్ట్‌ ఫ్రేస్నోలో ఓ ఇంట్లో ఆదివారం సాయంత్రం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తూ కొందరు స్నేహితులు పార్టీ చేసుకుంటున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారని, ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు ఫ్రేస్నో పోలీసులు తెలిపారు. వీరిలో ఒక వ్యక్తి ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిసింది. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు..? ఘటనకు కారణాలు ఏమిటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.
* ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పదిహేడేళ్ల తరువాత మరొకరిని ప్రేమించింది. విడాకుల కోసం కట్టుకున్నవాడిని, పిల్లలను కాదని కోర్టుకెక్కింది. కోర్టులో విడాకులు లభించకముందే మరో పెళ్లి చేసుకుంది.
*ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం. గుంటూరు రైల్వే స్టేషన్ లో నిలిపి వేత. 3 గంటలుగా ప్రయాణీకుల ఇక్కట్లు.భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ చక్రం బోల్ట్ వూడినట్లు గమనించదాంతో రైలు నిలిపి వేసి, ఏసీ కోచ్ ను రైలు నుంచి విడదీసి మరో బోగిని అమర్చిన రైల్వే సిబ్బంది.
*భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కె శిక్షణ యుద్ధ విమానం శనివారం గోవాలోని ఒక గ్రామానికి సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడ్డారని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
*మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బర్వానీ జిల్లా మాండ్వాడ వద్ద ఓ వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
*కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సమీపంలోని 44 వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
*కొంత కాలంగా ప్రేమించుకున్న ఆ యువతీ యువకులు పెద్దల నిర్ణయానికి బలైపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం ఆనందంగా గడుపుదామనుకున్న క్షణాలు ఆత్మహత్య రూపంలో ఆవిరైపోయాయి.
*ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఏడుగురు మావోయిస్టులు బస్తర్ ఐజీ సుందర్ రాజ్, సీఆర్పీఎఫ్ డీఐజీ కోమల్ సింహా, జిల్లా ఎస్పీ దివ్యాంగ పటేల్ ఎదుట లొంగిపోయారు.
*రెండేళ్ల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు మరో యువతిని ప్రేమ పేరుతో నమ్మించి రెండో పెళ్లి చేసుకొని కటకటాలపాలయ్యాడు.
*జిల్లా కోర్టు న్యాయమూర్తి నివాసం ఆవరణలో ఉన్న నాలుగు చందన వృక్షాలూ తెల్లారేసరికి మాయమైపోయిన సంఘటన ఇది. ఈ చందనం దుంగల ఖరీదు సుమారు రూ.3 నుంచి 5 లక్షల దాకా ఉండవచ్చని పోలీసులు శనివారం వెల్లడించారు. దొంగతనం జరిగిన తీరిది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఓ అయిదుగురు సభ్యుల దొంగల ముఠా ఇక్కడి సివిల్ లైన్ ప్రాంతంలో ఉన్న జడ్జీ నివాసం ఆవరణలోకి ప్రవేశించింది. కాపలాగా ఉన్న కాపలాదారులను తుపాకీతో బెదిరించి చకచకా చెట్లను కొట్టి చందనం దుంగలను ఈడ్చుకుని వెళ్లిపోయింది.
*న్యూదిల్లీ నుంచి త్రివేండ్రం వెళుతున్న కేరళ ఎక్స్ప్రెస్ శనివారం రాత్రి చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో పట్టాలు తప్పింది. ఏర్పేడుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఇంజిన్ వెనుక ఉన్న క్యాంటీ¨న్ బోగీ చక్రం విరిగిపోయింది.