Politics

దగ్గుబాటి రాజకీయ సన్యాసం అని జోరుగా ప్రచారం

Daggubati Venkateswara Rao Quits Politics-YSRCP

ప్రకాశం జిల్లా పర్చూటు నియోజకవర్గం పంచాయతీకి వైకాపా అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముగింపు పలికినట్లు తెలుస్తోంది పరుచూరు వైకాపా ఇన్చార్జిగా రవి రామనదాబాబు పేరును వైకాపా ఆదిస్థానం ఖరారు చేసింది. అయితే దీనిపై అధికారి ప్రకటన ఇంకా వెలువడలేదు. ఆదిస్థానం ఆదేశాల మేరకు ఒంగోలులో జరిగిన నాడు నేడు కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్న సభకు రామనాధం బాబు పరుచూరు వైకాపా ఇంచార్జి హోదాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సభలో ముందు వరసలో కూర్చున్నారు. దీంతో పరుచూరు వైకాపా ఇంకాహ్ర్జి వ్యవహారానికి పుల్ స్టాప్ పడినట్టే అని ఆపార్టీ నేతలు బావిస్తున్నాయి. ఇదిలా ఉంటె పార్టీలోని అసంతృప్తి నేతలను సమన్వయము చేసుకోవాలని రామనాధంకు అధిస్థానం షరతులు పెటినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ముఖ్యమంత్రి వెంకటేశ్వరావు మరోసారి రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టే అని ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో పర్చూరు వైకాపా అభ్యర్ధిగా మళ్ళీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి ఆతరువాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికల తరువాత దగ్గుబాటి దంపతులు ఒకే పార్టీలో ఉండాలని జగన్ తేల్చి చెప్పడంతో దగ్గుబాటి వైకాపా కార్యక్రమాలకు దూరమయారు. ఎటూ తేల్చకుండా సైలెంటు అయిపోయారు. తాజా పరిణామాలతో ఎన్టీఅర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ ప్రస్థానం వైకాపాలో ముగిసిపోయినట్టే అంటున్నారు. మరోసారి దగ్గుబాటి రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని ప్రచారం జోరుగా సాగుతోంది.