Videos

NBK “Ruler” Teaser Out

NBK

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్‌’. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. గురువారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అయితే, సాంకేతిక సమస్య కారణంగా టీజర్‌ విడుదల కాస్త ఆలస్యమైంది. ఇప్పటివరకూ ‘రూలర్‌’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్‌, మాస్‌లుక్‌లు సినిమాపై అంచనాలను పెంచగా, టీజర్‌ మరింత ఆసక్తికరంగా సాగింది. ‘ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటకు వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే..’ అంటూ బాలకృష్ణ పలికిన మాస్‌ డైలాగ్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రూలర్‌’ క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, భూమిక, జయసుధ, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.