NRI-NRT

టెన్నిస్సీలో రోడ్డు ప్రమాదం.బెజవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్ దుర్మరణం.

టెన్నిస్సీలో రోడ్డు ప్రమాదం.బెజవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్ దుర్మరణం.-Telugu Student Vybhav Gopishetty Dies In Nashville In Hit And Run Accident

అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సెలవు వారాంతం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్(26), జూడీ స్తాన్లీ(23)లు దుర్మరణం పాలయ్యారు. వైభవ్ టెన్నిస్సీ స్టేట్ యూనివర్శిటీలో ఫుడ్ సైన్స్‌లో Ph.D చేస్తుండగా, జూడీ MS చేస్తున్నారు. జూడీది కూడా భారతదేశమే. నోలెన్స్‌విల్ పైక్ వద్ద వాల్‌మార్ట్ నుండి వైభవ్, జూడీ ప్రయాణిస్తున్న నిస్సాన్ సెంట్రా కారును డేవిడ్ టొర్రెస్(26) అనే వ్యక్తికి చెందిన ట్రక్కు ఢీకొట్టగా బాధితుల కారు తునాతునాకులు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమయిన నిందితుడు డేవిడ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జూడీ, వైభవ్‌ల మృతదేహాలను స్వదేశాలకు తరలించేందుకు వారి మిత్రులు GoFundMe ద్వారా నిధుల సేకరణ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. – https://www.gofundme.com/f/funeral-for-vybhav-gopisetty-and-judy-stanley