WorldWonders

తలారీలు లేరు…అందుకే ఉరి తీయలేదు

No Talaris Available To Hang Nirbhaya Culprits-తలారీలు లేరు...అందుకే ఉరి తీయలేదు

సంచలనం సఅష్టించిన నిర్భయ దుర్ఘటనకు సంబంధించిన నిందితులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించిన నేపథ్యంలో.. మొత్తం ఆరుగురు నిందితులో ఒకరు జైలులోనే ఆత్మహత్యకు పాల్పడగా, మరొక నిందితుడు మైనర్‌ కావడంతో అతనికి 3 సంవత్సరాల శిక్షను విధించారు. మిగిలిన నలుగురుకి ఉరిశిక్షను అమలు పరచాల్సి ఉంది. వీరిని ఉరి తీయడానికి జైళ్ల శాఖ తలారి కోసం వెతుకులాట ప్రారంభించింది. మన దేశంలో ఉరిశిక్షల విధింపు చాలా తక్కువగా ఉండటం వల్ల శాశ్వత తలారులను నియమించుకోలేదు. గడచిన 10 సంవత్సరాలలో కేవలం నలుగురికి మాత్రమే ఉరిశిక్షను అమలు పరచినట్లు లెక్కలు చెబుతున్నాయి. నిందితుల్లో ఒకరైన వినరు శర్మ క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద పెండింగ్‌ లో ఉండటంతో.. వీరికి శిక్ష అమలు కాలేదనే వార్తలు ఇప్పటి వరకూ వినిపించాయి. గత శుక్రవారం ఓ కార్యక్రమంలో అత్యాచార నిందితులకు క్షమాభిక్షను ప్రసాదించే అవకాశం లేదని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. క్షమాభిక్షను కోరినట్లు చెబుతున్న వినరు శర్మ సైతం తాను ఏ పిటీషన్‌ దాఖలు చేయలేదని గత శనివారం చెప్పారు. ఈ రెండు పరిణామాలతో నిందితుల ఉరి తేదీకి మార్గం సుగమమయినట్లేనని భావించిన జైళ్ల శాఖ నిందితుల ఉరిశిక్ష అమలు కోసం తలారిని సిద్ధం చేసుకునే పనిలో నిమగమైంది.