Food

రేగు పండ్లు నిండుగా పోషకాలు

Regu Pandlu Are Full Of Minerals-Telugu Food And Diet News

రేగు పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా వున్నాయి. శరీరానికి చక్కటి పోషకాలు కావాలంటే రేగు పండ్లను తినాల్సిందే. రేగు పండ్లలో కొన్ని రకాలున్నాయి. వీటిలో చిన్న రేగు పండ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచీ రేగు పండ్లు కాపాడతాయి. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి అవసరం. అలాగే ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా వుండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినడం మంచిది. కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు సైతం ఈ పండ్లు తింటే మంచిది వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు కీళ్ల మంటల్ని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.