NRI-NRT

లాస్ఏంజెల్స్‌లో నాట్స్ బాలల సంబరాలు

2019 Los Angeles Childrens Day Celebrations By NATS-లాస్ఏంజెల్స్‌లో నాట్స్ బాలల సంబరాలు

లాస్ఏంజెల్స్‌లోని కాబ్రిల్లో ఉన్నత పాఠశాలలో నాట్స్ బాలల సంబరాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో ప్రవాస చిన్నారులు పాల్గొన్న ఈ వేడుకల్లో చదరంగం పోటీలు, సాంస్కృతిక నాట్యాలు, ప్రదర్శనలు, రోబోటిక్స్ ప్రదర్శనలు, స్టీవ్ ఓవెన్స్ మ్యాజిక్ షో వంటి వాటిని ఏర్పాటు చేశారు. మిస్ టీన్ ఇండియా రేచెల్ ఛార్లెస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు సినీ నటి లయ బహుమతులను అందజేశారు. వింధ్యా రాపోలు, పూజ సింగంశెట్టి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రవి ఆలపాటి, మధు బోడపాటి, వెంకట్ ఆలపాటి, హరి కొంక, వంశీ గరికపాటి, కృష్ణ కిషోర్ మల్లిన,రామ్ కొడితల, చందు నంగినేని,లాస్ ఏంజెల్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ చిలుకూరి, దిలీప్ సూరపనేని, రాధాకృష్ణ గూడా, రామకృష్ణ జిల్లెళ్లమూడి, వాలంటీర్స్ కార్యదర్శి మనోహర్ మద్దినేని, ఉమ్మడి కార్యదర్శి శంకర్ సింగంశెట్టి, కోశాధికారి గురుకొంక, రాజలక్ష్మి చిలుకూరి, సుధీర్ కోట, మురళి ముద్దెన, కరుణానిధి, రమేష్ మండపాక, ప్రభాకర్ రెడ్డి, శ్రీ పాల్ రెడ్డి , అనిత కాట్రగడ్డ, అనిత కొంక, చంద్ర మోహన్, బిందు కామిశెట్టి , అజిత్ బుర్ర, శ్రీనివాస్ మునగాల,కిరణ్ సింహాద్రి ,నర్సింహారావు తదితరులు వేడుకల విజయవంతానికి కృషిచేశారు.