Food

పసుపు విరివిగా వాడండి

Turmeric Aids In Hair Growth-telugu diet and food news

నేటికాలంలో చాలామంది జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నీ ప్రయత్నాలు చేసినా ఈ సమస్యలు దూరం కావట్లేదు. అయితే, పసుపుని ఉపయోగించడం వల్ల చక్కని ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

చాలా మంది జుట్టు సమస్యలు ఎదుర్కొంటారు. దీనికి పసుపుని ఉపయోగించి సమస్యని అదుపు చేసుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.. అదెలాగో చూద్దాం..

పసుపు మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. మన శుభకార్యాలు మొదలుకుని, వంటలు, అందం గురించి ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ పసుపు భాగస్వామ్యం ఉంటుంది. అందం విషయంలో పసుపుని చర్మంపై వాడతారు. దీని వల్ల మంచి రంగు, చర్మ సమస్యలు దూరం అవుతాయని చెబుతారు. అయితే, పసుపుని తలకి వాడడం వల్ల జుట్టుసమస్యలన్నీ కూడా నయం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. మరి పసుపుని జుట్టుకి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
కాలుష్యం, ఒత్తిడి, కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడడం ఇవే కాకుండా అనేక కారణాలతో జుట్టు రాలడం, చుండ్రు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. మనకు ఈజీగా అందుబాటులో ఉండే పసుపుని ఉపయోగించి ఈ సమస్యలన్నింటినీ తగ్గించుకోవచ్చు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీనిని తలకు రాయడం వల్ల జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి.

ముందుగా ఆలివ్ ఆయిల్ తీసుకోండి. అందులో కాసింత పసుపు కలిపండి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తలకి అప్లై చేయండి. వీలైతే నైట్ మొత్తం అలా వదిలేయండి. లేదా.. అరగంట తర్వాత శుభ్రం చేసుకోండి. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి తిరిగి పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా దూరం చేస్తుంది. సున్నిత చర్మం వారు ఈ రెమిడీని వైద్యుల సలహా మేరకు వాడాలి. ఇక ఎవరైనా ఈ రెమిడీని వాడొచ్చు.

అదే విధంగా.. హెన్నాని వాడుతుంటే అందులో కాసింత పసుపు కలపాలి. దీన్ని తలకి పట్టించాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. జుట్టుకి మంచి రంగు కావాలనుకునేవారు.. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా పచ్చిపాలలో పసుపు వేసి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత షాంపూత్ కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది.

జుట్టు రాలడం అనేది చాలా పెద్ద సమస్యే. ఈ సమస్యని తగ్గించుకునేందుకు కేవలం మార్కెట్స్‌లో దొరికే ప్రొడక్ట్స్‌ని వాడడం వల్లే ఉపయోగం ఉంటుందని అనుకోవడం పొరపాటే. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా సమస్యని చాలా వరకూ తగ్గించుకోవచ్చు. అందులో పసుపు అనేది చాలా వరకూ పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి చాలా సమస్యలను తగ్గించుకోవచ్చు. స్నానం చేసే నీటిలోనూ కాసింత పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ, కేశ సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి.

అదే విధంగా.. తల జిడ్డుగా ఉన్నప్పుడు ఉప్పు కూడా ఈ సమస్యలని దూరం చేస్తుంది. ఇందుకోసం మీరు ఓ చెంచా ఉప్పుని తీసుకుని షాంపులో కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి దీంతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు సమస్య దూరం అవుతుంది.

జుట్టు సమస్యలకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా కాలుష్యం, ఒత్తిడి, ఆరోగ్య, శుభ్రత లేకపోవడం వంటివి ఉంటాయి. వీటి వల్ల చాలా వరకూ జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం ఒక్క రెమిడీ జాగ్రత్తల కారణంగానే సమస్యను తగ్గించుకోలేం.

ఇక ఈ విషయంలో కరొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అవేంటంటే… జుట్టుకి పసుపు రాయడం వల్ల తెల్లబడుతుందని, అదే విధంగా ఉప్పుని వాడడం వల్ల ఊడడం మొదలవుతుందని చెబుతారు. కానీ, ఇలా చేయడం వల్ల సమస్య అనేది ఎక్కడ నిరూపణ కాలేదు.. కానీ, ఉప్పు, పసుపు అనేవి చర్మానికి మేలు చేస్తాయి కానీ, ఎలాంటి హాని చేయవు. ఇందులోని ప్రత్యేక గుణాలు చర్మరక్షణకు బాగా పనిచేస్తాయి. అందుకోసం మీరు హ్యాపీగా వీటిని సౌందర్య సాధనాలుగా వాడొచ్చు. వీటిని ఉపయోగించి మెరిసిపోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణుల మాట. ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులలోనూ వీటిని విరివిగా ఉపయోగిస్తారు. కాబట్టి మీరు వీటిని నేరుగా తీసుకోవచ్చు. అయితే తీసుకునే పరిమాణాన్ని బట్టి ఉంటుంది. అదే విధంగా అందరికీ అన్నీ పదార్థాలు పడవు. వారి చర్మ తత్వం వల్ల.. ఇది మీరు ముందుగా పరీక్షించుకోవాలి. ఆ తర్వాతే వాటిని ఉపయోగించండి..