Devotional

కన్నెపిల్లలకు మేలు చేసే ధనుర్మాస వ్రతం

Dhanurmasa Vratham And Its Importance

విశిష్ట ఫలదాయకం ధనుర్మాస వ్రతం
ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దివ్యప్రార్థనకు అనువైన మాసం. ధనుర్మాసం అత్యంత పునీతమైనది. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తారు.
**కాత్యాయనీ వ్రతం… పూజావిధానం
రోజులానే ముందు పూజ చేసుకోవాలి… ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం, గోదా అష్టోత్తరం చదువుకోవాలి… రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది… ముందుగా ప్రార్థన చదవాలి…ఆ తరువాత వరుసగా తనయ చదవాలి…తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్‌ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి… తనయ చదువుతూ తొమ్మిది, పది తనయలు రెండు సార్లు చదవాలి.. చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి..ఆ తరువాత ప్రార్థన చదవాలి.. తరువాత గోదాదేవి తనయ చదవాలి..ఆ తరువాత పాశురాలు చదవడం ప్రారంభించాలి.. పాశురాలు చదివేటప్పుడు మొదటి పాశురం రెండుసార్లు చదవాలి.. అలాS మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి… అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడిగా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను, చివరపాశురంలో ఒక లైను చదవాలి.. చివరగా గోదా హారతి చదవాలి.. మంత్రపుష్పం కూడా చదవాలి.. మళ్ళీ ఏ రోజు పాశురం ఆ రోజు రెండుసార్లు చదివి హారతి ఇవ్వాలి… నైవేద్యం సమర్పించాలి (రోజూ పొంగలి, దద్ధోజనం, పరమాన్నం ఉండి తీరాలి.. .సమయం ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు… కాని ఇవన్నీ సూర్యోదయానికి ముందే మొదలవాలి.
**ఆమే – ఆండాళ్‌
శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగితేలినవారిని ‘ఆళ్వారులు’ అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్‌ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్పకైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్‌ దొరికింది.
**కన్నెపిల్లలకు మేలు చేసే వ్రతం
వివాహం కాని, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.
ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలకీ‡్ష్మ అనుగ్రహం లభిస్తుందనీ. దరిద్రం దూరం అవుతుందనీ పెద్దలంటారు. ఈ మాసంలో రోజు బ్రహ్మముహూర్తంలో పాశురాలను పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవటం తథ్యమని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లీడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని ఆండాళ్‌ తల్లి పావన చరిత ద్వారా తెలుస్తుంది. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.ప్రతిరోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెలరోజులూ తులసీమాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తిమేరకు విష్ణుప్రతిమని తయారుచేయించి, పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణుకథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిచ్చి, ఆశీస్సులు అందుకోవాలి.ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి, తిరుప్పావై గాన, శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయకం కాగలదనీ ఆశిద్దాం.
**ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?
ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం, పాయసం, దధ్యోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పు, మిరియాలలో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.
**ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు?
రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యమూ జరపకూడదు.
**తిరుప్పావై అంటే ఏమిటి?
తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ‘తిరు’ అంటే శ్రీ అని, ’పావై’ అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవకన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్‌ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్‌ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించాడు.తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్రలేచి స్నానం చేయాలి.ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్‌కు ఇష్టమైన పుష్పకైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.

*** 2019లో బాబాకు భక్తులు ఎంత సమర్పించారంటే…
ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలోని సాయిబాబా దేవాలయానికి 2019లో విరాళాల రూపంలో భక్తులు రూ.287 కోట్లు సమర్పించారు. ‘‘2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు భక్తులు వివిధ రూపాలలో బాబాకు సమర్పించిన కానుకలు, మొక్కుల విలువ రూ.287 కోట్ల రూపాయలు. అంతకుముందు ఏడాది రూ.285 కోట్లు విరాళంగా వచ్చాయి’’ అని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్టీ) సీఈఓ దీపక్ ముగ్లికర్ తెలిపారు. ఈ మొత్తం విలువలో రూ.217 కోట్లు ధనరూపంలో రాగా.. అందులో దాదాపు మూడో వంతు చెక్కులు, డీడీలు, మనియార్డర్లు, క్రెడిట్-డెబిట్ కార్డులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, విదేశీ కరెన్సీ వంటి రూపాల్లో వచ్చాయని ఆయన వివరించారు. కాగా అభరణాలు, నాణేల రూపంలో వచ్చిన బంగారం 19 కిలోలు అయితే, 391 కిలోల వెండి వస్తువులను భక్తులు బాబాకు సమర్పించారు.
2. భక్తజనంతో కిటకిటలాడిన శ్రీక్షేత్రం
పూరీ శ్రీక్షేత్రం బుధవారం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడింది. జగన్నాథ నామస్మరణతో బొడొదొండో ప్రతిధ్వనించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామి దర్శనానికి వచ్చిన వారంతా తీరంలో స్నానాలు చేశారు. కొంతమంది సాగరునికి అభిముఖంగా సూర్యోపాసన చేశారు. మంగళవారం రాత్రి 10 గంటలకు శ్రీక్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల పవళింపు సేవలు చేపట్టిన సేవాయత్లు యంత్రాంగం సూచనల మేరకు రాత్రి 12.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచారు. గోప్యసేవల తర్వాత అర్ధరాత్రి ఒంటిగంటకు పురుషోత్తమ దర్శనానికి భక్తులకు అనుమతించారు. ఇది
* బుధవారం రోజంతా కొనసాగింది. బారికేడ్ల మధ్య వరుసక్రమంలో అందరూ స్వామి సన్నిధికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. నిర్ణీత వ్యవధి కంటే ముందుగా (12 గంటలకు) ఒబడా (మహాప్రసాదం) ముగ్గురు మూర్తులకు అర్పించి తర్వాత భక్తులకు అందించారు. శ్రీక్షేత్రం పాలనాధికారి కిషన్కుమార్, కలెక్టర్ బల్వంత్సింగ్, ఎస్పీ ఉమాశంకర్ మిశ్ర ఏర్పాట్లు పర్యవేక్షించారు.
3. తిరుమల\|/సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు గురువారం,
02.01.2020
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 18C°-23℃°
• నిన్న 86,422 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 01 గదుల్లో భక్తులు
సర్వదర్శనం కోసం వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
05 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.93 కోట్లు,
• నిన్న 24,284 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న 23,782 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
/ / గమనిక / /
• వైకుంఠ ఏకాదశి, ద్వాదశి
సందర్భంగా జనవరి 4
నుండి 7వ తేదీ వరకు
దాతలకు ప్రత్యేక
దర్శనాలు, గదుల
కేటాయింపును
నిలిపివేయ‌డ‌మైన‌ది.
• వైకుంఠ ఏకాదశి, ద్వాదశి
సందర్భంగా జనవరి 5
నుండి 7వ తేదీ వరకు
వృద్ధులు, దివ్యాంగులు,
చంటిపిల్లల తల్లిదండ్రుల
ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు
చేయ‌డ‌మైన‌ది.
వయోవృద్దులు/ దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తారు. ఉ: 7గంటల
కి నమొదు చేరుకోవాలి,
ఉ: 10 మ: 2 గంటలకి
దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు/
ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం ప్రవేశం ద్వారా
స్వామి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
తిరుప్పావై
ధనుర్మాసం కాలంలో తిమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.ttd Toll free #18004254141తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంకోసం క్రింద లింకు ద్వారా చేరండిhttps://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
4. మన ఇతిహాసాలు అంబరీషుడు
అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తి. ఈ రాజు శ్రీరాముడుకి పూర్వీకుడు. అత్యంత విష్ణు భక్తుడు.ఏకాదశీ వ్రతము-దూర్వాసుని రాకఈ వృత్తాంతం మహాభాగవతము, స్కాంద పురాణములలో చెప్పబడింది.1.అంబరీషుడు నాబాగుని కుమారుడు. బంగారాన్ని మట్టినీ సమానంగా చూసేవాడు. ఏకాదశీ వ్రతం చేసి, ఉపవాసం ఉండి, మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసదీక్ష విరమించి, ద్వాదశి పారణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చెయ్య బోతుండగా దూర్వాస మహర్షి వస్తాడు. దూర్వాసుడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీస్నానానికి వెళ్లి వస్తానని చెబుతాడు. స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకూ తిరిగి రాడు. ద్వాదశి ఘడియలు గడిచి పోతున్నాయని భావించి, ద్వాదశి ఘడియలు గడవక మునుపు దీక్ష విరమించడంకోసం భుజించక పోతే వ్రత భంగం జరుగుతుంది, భుజిస్తే అతిథిని భంగ పరచి నట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దలసలహా మేరకు, సమారాధన చేసి, తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి, దీక్షా విరమణ చేస్తాడు. అప్పుడు దూర్వాసుడు నదీస్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి, అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై, తన జటలలో ఒక దానిని నేలపై కొట్టి మహాకృత్యను సృష్టించి అంబరీషుని మీదకు దానిని విడిచి పెడతాడు. అంబరీషుడు విష్ణు భక్తుడు అవడం వల్ల శ్రీమహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచి పెడతాడు. సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి, దూర్వాసుడి మీదకు వెడుతుంది, బ్రహ్మ, శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు. చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు. మహావిష్ణువు దూర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే శరణు వేడుకొమ్మనీ అంటాడు. అప్పుడు గతి లేక దూర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది.
5. రాశిఫలం – 02/01/2020
తిథి:
శుద్ధ సప్తమి సా.6.38, కలియుగం-5121 తీశాలివాహన శకం-1941
నక్షత్రం:
ఉత్తరాభాద్ర రా.తె.5.38
వర్జ్యం:
మ.1.37 నుండి 3.23 వరకు
దుర్ముహూర్తం:
ఉ.10.00 నుండి 10.48 వరకు తిరిగి మ.248 నుండి 3.36 వరకు
రాహు కాలం:
మ.1.30 నుండి 3.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ విషయాలపై అనాసక్తితో వుంటారు. గృహంలో మార్పులు జరిగే అవకావాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) విందులు, వినోదాలకు దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురగును. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంల ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
6. శ్రీరస్తు శుభమస్తు
తేది : 2, జనవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బృహస్పతివాసరే (గురువారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(నిన్న రాత్రి 6 గం॥ 28 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 1 ని॥ వరకు సప్తమి తిధి తదుపరి అష్టమి తిధి)
నక్షత్రం : ఉత్తరాభద్ర
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు పూర్తిగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నది)
యోగము : (వరీయాన్ ఈరోజు రాత్రి 10 గం ll 40 ని ll వరకు తదుపరి పరిఘ రేపు రాత్రి 11 గం ll 24 ని ll వరకు)
కరణం (గరజి ఈరోజు ఉదయం 7 గం ll 44 ని ll వరకు తదుపరి వణిజ ఈరోజు రాత్రి 9 గం ll 1ని ll వరకు)
అభిజిత్: (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 12 ని ll)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 58 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు అమృతఘడియలు లేవు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 59 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నము 2 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 25 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నము 1 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నము 2 గం॥ 58 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 6 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 2 ని॥ వరకు)
సూర్యరాశి : (ధనుస్సు 16.12.2019 సాయంత్రం 3 గం ll 34 ని ll నుంచి 15.1.2020 తెల్లవారుఝాము 2 గం ll 11 ని ll వరకు)
చంద్రరాశి : (మీనం 1.1.2020 రాత్రి 9 గం ll 39 ని ll నుంచి 4.1.2020 ఉదయం 10 గం ll 6 ని ll వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 34 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 38 ని॥ లకు
7. శుభోదయం
మహానీయుని మాట
” అలలను ఆటుపోటులను ఆపలేకపోవచ్చు. కానీ ఈదడం నేర్చుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంది.
కష్టాలను సమస్యలను ఆపలేకపోవచ్చు. కానీ ఆత్మస్థైర్యం తో ఎదుర్కొవచ్చు. అది మనగుండెలోనే ఉంటుంది.”
నేటీ మంచి మాట
” తప్పనిపిస్తే ఒంటరిగా వున్నప్పుడు చెప్పాలి.
ఒప్పు అనిపిస్తే అందరిలో చెప్పాలి.”
8. నేటి ఆణిముత్యం
మొట్టమొదటిది యౌవన, మట్టి దాని
నీడ పదవి, యజ్ఞానము, తోడు కాక
ధనము, మదములు కూడిన మనుజు డిట్లు
నైదు విధముల పతనమ్ము నందు సుమ్ము
భావము :
యౌవనము, పదవి, యజ్ఞానములకు తోడుగా, సంపద, అహము చేరితే ఆ ఐదింటి వల్ల పతనం చెందుతారు.
9. నేటి జాతీయంగబ్బిలాయి
గబ్బిలాయి ……ని అపశకునపు పక్షిగాను, అందవికారమైనది గాను, దురదృష్ణమునకు మారు పేరుగాను దారిద్ర్యానికి కారణంగాను ఉటంకిస్తుంటారు. నిజానికి గబ్బిలము అందవికారముగాను, అది పూర్తి స్థాయి జంతువుగాను కాకుండా…. ఒక పక్షిగాను కాకుండ వుంటుండి. అది కనబడిన వెంటనే దానిని వెంబడించి తరుముతారు. అది ప్రవేశించిన ఇంటిలో దరిద్రము తాండవిస్తుందని నమ్ముతారు ప్రజలు. ఆవిధంగా నిందా వాచకముగా ఇతరులను నించించే టప్పుడు….. గబ్బిలాయి మొఖం, అని. తెలివి లేనివాడనే అర్థంలోను ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
10. నేటి సుభాషితం
ఒక గొప్ప పని చేసే ముందు చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజం
నేటి సామెత
పులిమీద స్వారి
వివరణ: పులిమీద స్వారి చాల ప్రమాదకరము.పులి మీద ఎక్కినవాడు అలా స్వారి చేస్తూనే వుండాలి. దిగాడంటే పులి వాడిని తినేస్తుంది.మిక్కిలి ప్రమాదకరమైన పని చేస్తున్న వారినుద్దేశించి చెప్పేసామెత ఇది.