Health

ఆలింగనమే ఓ ఔషధం

Hugs Are The Best Medicine-Telugu Health News

కౌగిలింత.. ఇది భాషకు అందని ఓ అనుభూతి. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఈ ఆత్మీయ స్పర్శతో చెప్పొచ్చని చెబుతారు శాస్త్రవేత్తలు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండోయ్. అవేంటో ఇప్పుడు చూద్దాం.ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల శారీరకరంగా, మానసికంగా ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు. అయితే, మన దగ్గర ఇంకా అంతగా లేదు కానీ, మిగతా దేశాల్లో ఒకరిని ఒకరు ప్రేమగా కౌగిలింతతో పలకలరించుకుంటారు. మనదగ్గర అత్యంత సన్నిహితులకి మాత్రమే కౌగిలింతలు ఉంటాయి. చాలామంది రోజంతా పనిచేసి త్వరగా అలసిపోతారు. ఆ సమయంలో ఆలింగనం చేసుకుంటే వ్యయప్రయాసలన్నీ దూరం అవుతాయని చెబుతున్నారు పిట్స్బర్గ్లోని కార్నేజీ మెలోన్ యూనివర్సిటీ నిపుణులు. భార్యా,భర్తలు ఆలింగనం చేసుకోవడం వల్ల దంపతులు ఎక్కువ కాలం బతుకుతారని అంటున్నారు.అంతేకాదు.. చూడడానికి కూడా ఎంతో యవ్వనంగా కనిపిస్తారట. కాబట్టి భార్యా, భర్తలు రోజుకు ఒకసారైనా తమ పార్టనర్ని ప్రేమతో హగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితోపాటుగా గుండె సమస్యలు, షుగర్, బీపీ లాంటి ఆరోగ్య సమస్యలేవీ దరిచేరవట. కౌగిలింత వల్ల ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మనిషిలో రిలాక్స్ని పెంచుతాయి. దీంతో ఒక్కసారిగా మూడ్ మారిపోతుంది. డిప్రెషన్, ఒత్తిడిలు తగ్గిపోతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.